ప్రధాని, హోంమంత్రి అనుమతితోనే రివర్స్‌ టెండరింగ్‌

ఎంపీ విజయసాయిరెడ్డి
 

న్యూఢిల్లీ:  ప్రధాని, హోంమంత్రి అనుమతితోనే రివర్స్‌ టెండరింగ్‌ చేపడుతున్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన రైల్వే నిధులు విడుదల చేయాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ నేతలు చేసే దుష్ర్పచారాన్ని ఎవరూ నమ్మొద్దని ఆయన కోరారు. కృష్ణా నదిలో నీటిమట్టం పెరగడం వల్లే కొండవీటి వాగుకు వరద వచ్చిందన్నారు. పప్పునాయుడు అవగాహనతో ట్వీట్లు చేస్తున్నట్లు లేదన్నారు. ఎవరో ఆయన కార్యాలయ సిబ్బంది చేస్తున్నట్లు ఉందని పేర్కొన్నారు. 

Back to Top