ప్రజావేదిక నిర్మాణంలో సిమెంట్‌ కంటే ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిసేనే ఎక్కువ కనిపిస్తోంది..

ట్విట్టర్‌లో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
 

 

ప్రజావేదిక అనే రేకుల షెడ్డు నిర్మాణంలో సిమెంట్‌ కంటే సినిమా సెట్టింగుల్లో వాడే  ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌నే ఎక్కువగా వాడినట్లు కనిపిస్తోందని ట్విట్టర్‌లో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.  కోటి ఖర్చయ్యే తాత్కాలిక నిర్మాణానికి 9 కోట్లు ఖర్చైనట్లు చూపారని ట్విట్‌ చేశారు. చంద్రబాబు హయాంలో జరిగిన నిర్మాణాలన్నీ ఇలాగే ఉంటాయనిపిస్తోంది. ప్రజావేదిక షెడ్డు తొలగింపు చూసేందుకు వచ్చిన ప్రజలకున్న అవగాహన కూడా టీడీపీ నేతలకు లేకపోవడం దురదృష్టకరం. రాజధాని కోసం మా నుంచి 33 వేల ఎకరాలు సేకరించారు.ప్రజావేదికను కరకట్టకు బదులుగా ఆ భూముల్లోనే కట్టి ఉంటే ఇవాళ ప్రజాధనం వృధా అయ్యేది కాదు కదా అని ప్రశ్నిస్తున్నారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top