శవ రాజకీయాలు చంద్రబాబుకే చెల్లుతాయి..

చంద్రబాబు నీచ రాజకీయాలు మానుకోవాలి..

వైయస్‌ఆర్‌సీపీ నేత విజయసాయిరెడ్డి 

హైదరాబాద్‌: హరికృష్ణ పార్థివదేహాన్ని పక్కన పెట్టుకుని..టీఆర్‌ఎస్‌తో సంప్రదింపులు జరిపే నీచ రాజకీయాలు చేసే మనస్తత్వం వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి లేదని.. అది ఒక చంద్రబాబుకే చెల్లుతుందని వైయస్‌ఆర్‌సీపీ నేత విజయసాయి రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ లోటప్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన రావాలి జగన్‌–కావాలి జగన్‌ ఆడియో సాంగ్‌ లాంచ్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అటువంటింది ఏమైనా ఉంటే చెప్పి చేస్తాం కాని..దొడ్డి దారిన శవ  రాజకీయాలు చేసే పార్టీ వైయస్‌ఆర్‌సీపీ కాదని చెప్పారు. ఈ విషయాన్ని చంద్రబాబు గమనించుకోవాలన్నారు. ఆరోపణలు చేసేముందు తను గతంలో ఏంచేశాడో చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు.నిరాదరణ ఆరోపణలు చేయవద్దని  హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌తో సంబంధాలు లేవని..ఆ అవసరం కూడా లేదని స్పష్టంచేశారు.

చంద్రబాబు పాలన ఎందుకు వద్దు, బాబు ఎందుకు దిగిపోవాలని నిన్ను నమ్మం బాబు అనే కార్యక్రమం ద్వారా స్పష్టంగా చెప్పాని ఎంపీ విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. అదే ప్రచార కార్యక్రమంలో భాగంగా వైయస్‌ జగన్‌ ఎందుకు రావాలి.. ఎందుకు కావాలి అనేది చెప్పడానికి పాటను రిలీజ్‌ చేశామన్నారు. వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ఏం చేస్తారు. ఎలా చేస్తారు. పార్టీ విధి, విధానాలు ఏంటీ అనేది ప్రసార మాధ్యమాల ద్వారా, గడప గడపకూ వైయస్‌ఆర్, పబ్లిక్‌ మీటింగ్‌ల ద్వారా చెప్పామన్నారు. సోషల్‌ మీడియాలోని అన్ని సాధనలను ఉపయోగించుకొని ప్రజలకు మరింత చేరువ కావాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. 

 

 

తాజా ఫోటోలు

Back to Top