చంద్రబాబు అఖిలపక్షం నిర్వహించడం  హాస్యాస్పదం

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
 

విశాఖ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దు..ప్యాకేజీ ముద్దు అన్న చంద్రబాబు అఖిలపక్ష సమావేశం నిర్వహించడం హాస్యాస్పదమని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేశారని విమర్శించారు. కేంద్రం ప్యాకేజీ ఇస్తామన్నప్పుడు అఖిలపక్షాన్ని ఎందుకు పిలువలేదని నిలదీశారు. మొదటి నుంచి హోదా కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ వైయస్‌ఆర్‌సీపీనే అన్నారు. టీడీపీ తప్ప హోదా కోసం ఎవరూ పోరాటం చేసినా వైయస్‌ఆర్‌సీపీ మద్దతు ఉంటుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. 
 

Back to Top