బీసీలను ఉన్నత స్థానాలకు ఎదగనిచ్చారా..?

చంద్రబాబుపై  ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్‌...

హైదరాబాద్‌: నాలుగున్నరేళ్ల పాలనలో బీసీలను చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు.నాలుగు నెలల్లో చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి కానున్నారని ఎద్దేవా చేశారు.ఇప్పుడు కులానికొక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు.బీసీలను ఓటు బ్యాంక్‌గా వాడుకోవడం తప్ప ఉన్నతస్థానాలకు ఎదగనిచ్చారా అని అన్నారు.

ఇద్దరు బీసీలను హైకోర్టు జడ్జిలుగా నియమించరాదని తప్పుడు ఆరోపణలతో లేఖ రాసిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు.జస్టిస్‌ ఈశ్వరయ్య ఆధారాలతో సహా బయటపెట్టారన్నారు.దేశంలో ఓటుకు రూ.500 ముట్టచెప్పే పద్దతిని చంద్రబాబు ప్రవేశపెట్టారన్నారు.ఇప్పుడు ఓటు ధరను రూ.10వేలకు తీసుకువెళ్ళారన్నారు.ఎమ్మెల్యేల ధర రూ.20 కోట్లు,ఎంపీల ధర రూ.50 కోట్లకు చేర్చారన్నారు.

 

 

తాజా ఫోటోలు

Back to Top