విశాఖపట్నం: తన ప్రతిష్టను దెబ్బతీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలని వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ఒక ఆదివాసీ మహిళా అధికారిని అవమానించారు. ఆమెతో నాకు సంబంధం అంటగట్టారు. ఎలాంటి ఆధారాలు లేని కథనాలు ప్రసారం చేశారు. అసత్య కథనాలు ప్రసారం చేసినవారితో క్షమాపణలు చెప్పిస్తానని మండిపడ్డారు. కూటమి రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారని, తాటాకు చప్పుళ్లకు తాను భయపడే వాడిని కాదని అన్నారు. ఇవాళ విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా భయపడే ప్రసక్తేలేదన్నారు. ఐదేళ్ల తర్వాత వైయస్‌ఆర్‌సీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తోక ఆడించే వారి తోకలను తాము వచ్చాక కత్తిరిస్తామని హెచ్చరించారు. చిన్న కుటుంబం నుంచి వచ్చి కష్టపడి ఎదిగాను. బ్లాక్ మెయిల్ చేసి డబ్బు వసూల్ చేసే వ్యక్తిని కాదు. రాధాకృష్ణ, బీఆర్‌నాయుడు, వంశీకృష్ణ మాదిరి వ్యక్తిని కాదు. అన్ని హక్కుల కమిషన్‌లకు ఫిర్యాదు చేస్తా. మహాన్యూస్ వంశీకృష్ణను వదలను. పార్లమెంట్‌లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడతా. ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తా అని విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. విజయసాయిరెడ్డి ప్రెస్‌మీట్ ముఖ్యాంశాలు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైయస్‌ఆర్‌సీపీ నాయకులపై వరుస క్రమంలో బురద జల్లుతున్నారు.. నాపై నిరాధార ఆరోపణలు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదు నా ఇంటికి టీడీపీ నాయకుడు, ఒక మహిళ వచ్చారు ఇది సిసీ కెమెరాల్లో రికార్డు అయింది విజయసాయి రెడ్డి గాడు పారిపోయాడా ఉన్నాడా? అని అడిగాడు వాడు టైం చెపితే నేనే వస్తాను, నేనే వాడి ఇంటికి వెళ్తాను మేము ఎవడికి భయపడేది లేదు మళ్ళీ వచ్చేది వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వమే మధ్యంతర ఎన్నికలు వచ్చిన వైయస్‌ఆర్‌సీపీ విజయం సాధిస్తుంది తాటాకు చపపుళ్లకు భయపడేది లేదు.. ఒక ఆదివాసీ మహిళకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు ఆధారాలు లేని ఆరోపణలు చేశారు మహా న్యూస్, ఎబిఎన్, టీవీ 5 నాపై తప్పుడు కథనాలు ప్రచారం చేశారు. కనీసం నా వివరణ కూడా తీసుకోలేదు మీతో ఎలా క్షమాపణ చెప్పించాలో నాకు తెలుసు నా వ్యక్తిత్వం ఏమిటో నాకు తెలుసు రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, వంశీ కృష్ణ లాగా బ్లాక్ మెయిల్ చేయడం నాకు తెలియదు.. నేను తప్పు చేస్తే దేవ దేవుడు శిక్షిస్తాడు బరితెగించి హద్దులు మీరి.. ఆధారాలు లేకుండా ఆదివాసీ మహిళతో సంబంధం కట్టబెట్టారు ఈ కుట్ర వెనుక ఉన్న వంశీ, రాధా కృష్ణ, వెంకట కృష్ణ, బిఆర్ నాయుడు, సాంబ లకు బుద్ధి చెపుతాను రామోజీరావును ధైర్యంగా ఎదుర్కొన్నాను వంశీ అనే వాడిపై, పరువు నష్టం దావాతో పాటు పార్లమెంట్‌లో ప్రివిలేజ్ మోషన్ ఇస్తాను. ఎస్టీ కమిషన్, ఉమెన్ ఆర్గనైజేషన్ ను ఫిర్యాదు చేస్తాను ప్రైవేట్ మెంబర్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెడతాను సహాయం కోసం వస్తే సంబంధం అంటకట్టేస్తారా వయసుతో సంబంధం లేకుండా తప్పుడు ప్రచారం చేస్తారా సాయిరెడ్డి తండ్రి లాంటి వారని ఆదివాసీ మహిళ చెప్పింది. వంశీ అమ్మ అబ్బకు పుట్టి ఉంటే ఇటువంటివి రాసే వాడు కాదు కుట్రలో భాగంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా తప్పుడు ప్రచారం చేసింది ఒక సామాజిక వర్గానికి చెందిన ఛానెల్స్ నాపై తప్పుడు ప్రచారం చేశారు వంశీ మీ అమ్మ అక్క చెల్లి ఎవరైనా ఇటు వంటి ఆరోపణలు చేస్తే ఇలానే డిబెట్లు పెడతావా వంశీ, సాంబ, వెంకట కృష్ణ పుట్టుక మీద నాకు అనుమానం ఉంది మీకు డీఎన్ఏ టెస్ట్ లు చేయాలి బ్లీచింగ్ పౌడర్, టాల్కం పౌడర్‌కు తేడా తెలియని వ్యక్తి వంశీ ఓనమాలు రాని వ్యక్తి వంశీ తల్లికి చెల్లికి తేడా తెలియని వ్యక్తి వంశీ వంశీ ఇంట్లో ఆడవాళ్ళు మీద ఆరోపణలు చేస్తే ఆ బాధ తెలిసేది టీవీ 5 సాంబ గురించి సంద్య శ్రీధర్ గురించి అడగాలి వెంకట కృష్ణ అమ్మాయిని మోసం చేసి ఈనాడులో ఉద్యోగం పోగొట్టుకున్న వ్యక్తి ఎవరో మహిళతో మహాన్యూస్ వంశీకి అక్రమ సంబంధం ఆటగట్టి డీఎన్ఏ టెస్ట్ అడిగితే ఎలా ఉంటుంది