వెన్నుపోట్లతోనే ఏదైనా చేయొచ్చనుకుంటాడు

ఎల్లో మీడియా కొక్కొరోకో అంటేనే తెల్లారే రోజులు పోయాయి

చంద్రబాబు, పచ్చమీడియా తీరుపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌

తాడేపల్లి: ప్రతిపక్షనేత చంద్రబాబు, ఎల్లో మీడియా తీరుపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఎండగట్టారు. ట్విట్టర్‌ వేదికగా విమర్శణాస్త్రాలు సంధించారు. ‘ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజీలేని పోరు జరుపుతానని ఎగిరెగిరి పడుతుంటే నిజమే అనుకున్నారంతా. కమ్మని విందులతో పార్క్‌ హయత్‌ సాక్షిగా ఇలా దొరికిపోతాడని ఊహించలేదు. జీవితంలో ముఖాముఖి తలపడే యుద్ధానికి సాహసించడు. వెన్నుపోట్ల తోనే ఏదైనా చేయొచ్చనుకుంటాడు’. అని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. 

అదే విధంగా ‘పార్క్‌ హయత్‌ భేటీ వార్తలను ఎల్లో మీడియా తొక్కిపెట్టింది. అంతగా పట్టించుకోదగిన ఘటన కాదని ప్రజల కళ్లకు గంతలు కట్టాలని చూసింది. వాళ్లు ‘కొక్కొరోక్కో’ అంటేనే తెల్లారే రోజులు పోయాయి. తెలుగు రాష్ట్రాల్లోని 9 కోట్ల మంది ఆ ముగ్గురి రహస్య కలయికను చూసారు. సోషల్‌ మీడియా ఊరుకోదు కదా’ అని మరో ట్వీట్‌ చేశారు. 
 

Back to Top