ఢిల్లీ: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ పాలనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వైయస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. కూటమి ప్రభుత్వ వంద రోజుల పాలనలో విశాఖ ఉక్కును తుక్కు కింద మార్చేశారని అన్నారు. అలాగే, పురుషులందు ఈ దుర్మార్గపు చంద్రబాబు వేరయా అని చెప్పుకోవాలి అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా.. చంద్రబాబు 100 రోజుల పనితీరు పార్ట్-2 పేరుతో.. 100 రోజుల్లో ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. 100 రోజుల్లో 60 అత్యాచారాలు జరిగాయి. 100 రోజుల్లో విజయవాడలో "ఐరన్ లెగ్" పాలనలో వరదల్లో 60 మందిని చంపేశారు వరద బాధితులకు కనీస సహయ సహకారాలు కూడా అందించలేదు. బాబు ఫోటోషూట్ తప్ప. 100 రోజుల్లో గుడ్లవల్లేరు కాలేజీ మహిళ హాస్టల్ బాత్రూంలో కెమెరాలు పెట్టి 3 వేల వీడియోలు తీసారు. 100 రోజుల్లో విశాఖ ఉక్కు ను తుక్కు కింద మార్చేశారు. వైజాగ్ ఆర్థిక వెన్ను ను చంద్రబాబు ప్రభుత్వం విరిచేసింది. విశాఖ ఉక్కు కార్మిక ఉద్యమ తుఫానులో చంద్రబాబు కొట్టుకుపోవడం ఖాయం. అమరావతి వరదముంపులో ఇల్లు లేక కలెక్టర్ ఆఫీసు లో తలదాచుకున్న బాబుకు అదికూడా మిగలదు. 100 రోజుల్లో పోలవరాన్ని నాశనం చేశారు. 100 రోజుల్లో అమరావతిని మునిగి పోకుండా ఉండటానికి ప్రకాశం బ్యారేజీని టిడిపి నేత బోట్లతో గుద్దించారు. 100 రోజుల్లో మెడికల్ కాలేజీ లను నాశనం చేశారు. 100 రోజుల్లో సచివాలయ వ్యవస్థను నాశనం చేశారు. 100 రోజుల్లో వాలంటీర్ వ్యవస్థను నాశనం చేశారు. 100 రోజుల్లో రేషన్ వాహనాలు నాశనం చేశారు. 100 రోజుల్లో 10 వ్యాపార కంపెనీలను రాష్ట్రం నుంచి తరిమేశారు. 100 రోజుల్లో రోడ్లను నాశనం చేశారు, గుంతలపై తట్ట మట్టి కూడా వేయలేదు 100 రోజుల్లో ప్రత్యర్థి రాజకీయ నేతలపై పదివేల దాడులు చేశారు. 100 రోజుల్లో రాష్ట్రాన్ని నేరమయం చేశారు , నేరాలు దారుణంగా పెరిగిపోయాయి. 100 రోజుల్లో 40వేల కోట్ల అప్పులు చేశారు. 100 రోజుల్లో మొత్తంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. 👉మిగతా 1725 రోజుల చంద్రబాబు పాలనలో ప్రజలకు కష్టాలు, రాష్ట్రవిధ్వంసం ఎలా ఉంటుందో ఊహించుకోండి. 👉భారతదేశంలో బాబులాంటి నిష్కారణ శత్రువులు వుంటారు. మనం ఏ తప్పు చేయకపోయినా వాళ్ళు తప్పులు చేస్తూ ఎదుటివారి మీద నిందలు వేస్తుంటారు. వారిలో ఆద్యుడు ఈ చంద్రబాబు. 👉చంద్రబాబు జీవిత చరిత్ర అంతా ఏ పేజీ తిరగేసినా నేరాల చిట్టా కనిపిస్తుంది. అబద్ధాల వాక్యాలతో నిండిన ఈ దరిద్రపు పుస్తకాన్ని ఎల్లో కుల మీడియా చాటున గొప్ప చరిత్ర గా చూపిస్తూ సమాజాన్ని మోసం చేస్తున్నాడు. 👉పురుషులందు పుణ్య పురుషులు వేరయా అంటాడు వేమన. కానీ పురుషులందు ఈ దుర్మార్గపు చంద్రబాబు వేరయా అని చెప్పుకోవాలి. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అంటాడు చంద్రబాబు. 👉తప్పొప్పులు, సత్యా అసత్యాలకు సరిహద్దు మర్చిపోయిన చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రానికి పాలకుడిగా రావటం ప్రజల దురదృష్టం. 👉మొదట్లో ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినప్పుడు ఆయన ఒక్కరే ఇతని చేతిలో మోసపోయాడు అనుకున్నాను. కానీ 1995నుండి ప్రజలు కూడా వెన్నుపోటుకు గురయ్యారని బాధగా అనిపిస్తున్నది. 👉టీడీపీ నాయకులకి ఏంచెప్పినా దున్నపోతు మీద వాన కురిసినట్లే. సిగ్గు ఎప్పుడో వదిలేసారు. మానం, మర్యాదలు వాళ్ళ నిఘంటువు లో లేవు. 👉వైఎస్సార్‌సీపీ నాయకులూ కార్యకర్తలు పోరాడాలి. టీడీపీ వాళ్ళు మట్టిలో కలిసే వరకు పోరాడాలి అంటూ కామెంట్స్ చేశారు.