సీఎం సూచనలను అందరూ స్వాగతిస్తున్నారు

వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

తాడేపల్లి: విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చేసిన సూచనను అందరూ స్వాగతిస్తున్నారని వైయస్‌ఆర్‌ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ‘వైజాగ్‌ స్టీల్‌ ప్రైవేటీకరణపై జగన్‌ గారు చేసిన నిర్మాణాత్మక సూచనలను అందరూ స్వాగతిస్తున్నారు. గనులు కేటాయిస్తే వైజాగ్‌ స్టీల్‌ లాభాల్లోకి వస్తుందని ప్రధానికి సీఎం లేఖ రాశారు. అవసరమైతే వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను తామే కొనుగోలు చేస్తామంటూ ముందుకొచ్చి అరుదైన సాహసాన్ని ప్రదర్శించింది రాష్ట్రం’ అని ట్వీట్‌ చేశారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top