ఆ ప‌ద‌వి విలువ ఏపాటిదో అంద‌రికీ తెలిసిపోయింది

చంద్ర‌బాబు వైఖ‌రిపై ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి: ‌‌అచ్చెన్నాయుడు ప్రోగ్రాం తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌లో పెట్టుకోవ‌డానికి నో చెప్ప‌డం బీసీల‌ను అవహేళ‌న చేయ‌డం కాదా అని వైయ‌స్ఆర్ సీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య‌సాయిరెడ్డి చంద్ర‌బాబును ప్ర‌శ్నించారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్‌లో స్పందిస్తూ.. `అబ్బాయికిస్తారని ఊరించి బాబాయి అచ్చెన్నను అధ్యక్షుడిగా అపాయింట్ చేసినప్పుడే దాని విలువ ఏపాటిదో అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు అధ్యక్ష ప్రమాణానికి రానని బాబు చీదరించుకోవడం, కనీసం పార్టీ ఆఫీసులో ప్రోగ్రాం పెట్టుకోవడానికి నో చెప్పడం బీసీలను అవహేళన చేయడం కాదా విజనరీ!` అని ట్వీట్ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top