సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌లో ప్ర‌జ‌లు సంతోషంగా ఉండాల‌ని..

వెంకన్న సన్నిధిలో వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు, అసెంబ్లీ స్పీక‌ర్‌ 

తిరుపతి: సీఎం వైయ‌స్‌ జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్న‌ట్లు వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. శ‌నివారం ఏపీ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీ పార్వతి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి   తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..  కరోనాతో మానవాళి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది.. త్వరగా మెడిసిన్, వ్యాక్సిన్ వచ్చేలా ఆశీర్వదించాలని ప్రార్థించానని చెప్పుకొచ్చారు. శ్రీవారి దర్శన అనుమతికి ఇబ్బందులు ఎదురవుతున్నా, ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నారని విజయసాయిరెడ్డి ప్రశంసించారు.

తాజా ఫోటోలు

Back to Top