`నిమ్మగడ్డ కోసం ఆయనెందుకు హైరానా పడుతున్నాడో?`

తాడేప‌ల్లి: నిమ్మగడ్డ లాంటి వ్యక్తి ఎస్ఈసీగా ఉంటే ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా పనిచేయదని ప్రజలనుకుంటున్నారని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్‌లో స్పందిస్తూ.. ఎస్ఈసీ విష‌యంలో ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంద‌న్నారు. నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ పదవి నుంచి దిగిపోయాడని చంద్ర‌బాబు రెండు డజన్ల మంది అడ్వొకేట్లను రంగంలోకి దింపాడ‌ని, నిమ్మగడ్డ కోసం బాబు ఎందుకు హైరానా పడుతున్నాడో? అని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. 

Back to Top