విశాఖకు పరిపాలన రాజధాని రాకను ఎవరూ ఆపలేరు

దిశ యాప్‌ మహిళల రక్షణకు వజ్రాయుధం

వైయస్‌ఆర్‌ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి

విశాఖపట్నం: దిశ యాప్‌ మహిళల రక్షణకు వజ్రాయుధం అని వైయస్‌ఆర్‌ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. మహిళా భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. దిశ చట్టం, దిశ పోలీస్‌ స్టేషన్లు, దిశ ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశామన్నారు. మహిళలు, యువతుల భద్రత కోసం దిశ యాప్‌ను కూడా రూపొందించామన్నారు. దిశ యాప్‌పై సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. విశాఖకు పరిపాలన రాజధాని రాకను ఎవరూ ఆపలేరన్నారు. విశాఖపట్టణాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఇప్పటికే విశాఖలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. 

తాజా ఫోటోలు

Back to Top