చంద్రబాబు రాష్ట్రానికి చేసింది శూన్యం...

వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి..

కర్నూలు: 2014లో ఇచ్చిన ఏ హామీని చంద్రబాబు నెరవేర్చలేదని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి అన్నారు.ఎన్నికలు వస్తున్నాయనే చంద్రబాబు పథకాలు ప్రకటిస్తున్నారన్నారు.ప్రజలను మభ్య పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. నవరత్నాలను వైయస్‌ జగన్‌ను అమలు చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌పైనే కేటీఆర్,వైయస్‌ జగన్‌ చర్చించారని,వారి భేటీలో పొత్తుల ప్రస్తావనే రాలేదన్నారు.చంద్రబాబు,పచ్చమీడియా విష ప్రచారం చేస్తుందని విమర్శించారు.ప్రజలు వాస్తవాలు గ్రహించాలన్నారు.ఈ నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి చంద్రబాబు చేసింది శూన్యమన్నారు.

 

 

Back to Top