దేశమంతా ఆంధ్రరాష్ట్రం వైపు చూస్తుంది

వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ వంగా గీత
 

తూర్పుగోదావరి: దేశమంతా ఆంధ్రరాష్ట్రవైపు చూస్తుంది. మహాత్మాగాంధీ జయంతి ఉత్సవాల సందర్భంగా గాంధీ కోరుకున్న గ్రామ స్వరాజ్యం మాటను నిజం చేస్తూ సీఎం వైయస్‌ జగన్‌ గ్రామ, వార్డు సచివాలయాలను తీసుకువచ్చారని ఎంపీ వంగా గీత అన్నారు. కరపలో జరిగిన బహిరంగ సభలో ఎంపీ వంగా గీత మాట్లాడుతూ.. ఉద్యోగం వచ్చిన కుటుంబాలు నా బిడ్డకు జగనన్న ఉద్యోగం ఇచ్చాడని ఆనందపడుతూ సీఎం వైయస్‌ జగన్‌ను ఆశీర్వదిస్తున్నాయన్నారు. నేను ఉన్నాను.. నేను విన్నాను అని మాత్రమే కాకుండా నేను ఉంటాను.. మీకు అన్నీ చేస్తానని సీఎం ముందుకు వెళ్తున్నారన్నారు. ప్రజలందరి ఆశీర్వాదాలు సీఎం వైయస్‌ జగన్‌కు ఉండాలని కోరుకుంటున్నానన్నారు. వారసులంటే ఆస్తులకు మాత్రమే కాదు.. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలకు వారసులు వైయస్‌ జగన్‌.. సీఎం వైయస్‌ జగన్‌కు ప్రజలంతా అండగా ఉండాలని కోరారు.

Back to Top