ఒకే దేశం, ఒకే జెండా సమ్మతమే

వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ రఘరామ కృష్ణంరాజు

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రం నిర్ణయం

న్యూఢిల్లీ: ఒకే దేశం, ఒకే జెండా నినాదం మంచిదేనని,  ఇది తమకు కూడా సమ్మతమేనని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. ఆర్టికల్‌ 370 రద్దు తీర్మానం, జమ్మూకశ్మీర్‌ పునర్విభజన బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. జమ్మూకశ్మీర్‌ విషయంలో దశాబ్దాల కల నెరవేరుతుండటం సంతోషంగా ఉందన్నారు.  కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల జమ్మూకశ్మీర్‌లో మంచి జరుగుతుందని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రం నిర్ణయం తీసుకుందని, కశ్మీర్‌ పునర్విభజన బిల్లుకు తమ మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో జమ్మూకశ్మీర్‌లో అభివృద్ధి జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 
 

తాజా ఫోటోలు

Back to Top