విజయవాడ: నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలని చెప్పే దమ్మున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్. అధికారంలో వాటా, సంపదలో వాటా, ఉద్యోగాల్లో వాటా, విద్యలో వాటా, రాజ్యాధికారంలో వాటా, నామినేటెడ్ పోస్టుల్లో.. ఇలా అన్ని రంగాల్లో వాటా ఇస్తున్న సీఎం వైయస్ జగన్‌కు సంపూర్ణ మద్దతు ఇచ్చి కాపాడుకుందాం బీసీ సంఘాల నేతలకు వైయస్‌ఆర్ సీపీ రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. విజయవాడలో బీసీ సంఘాల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. సీఎం వైయస్ జగన్ నిర్మిస్తున్న సోషలిస్టు సమాజాన్ని చూసి ఇతర రాష్ట్రాలవారు కూడా ఆశ్చర్యపోతున్నారన్నారు. బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ బలోపేతానికి సీఎం వైయస్ జగన్ పెద్దపీట వేశారని ఎంపీ ఆర్.కృష్ణయ్య గుర్తుచేశారు. విద్యారంగానికి అధిక ప్రాధానమిస్తూ బ్రహ్మాండమైన పథకాలకు శ్రీకారం చుట్టారని చెప్పారు. దేశంలోని అనేక రాష్ట్రాలు తిరిగి చూసినా అమ్మ ఒడి పథకం, పూర్తి ఫీజురీయంబర్స్‌మెంట్ పథకం, కాలేజీ విద్యార్థుల బోర్డింగ్, లాడ్జింగ్ కోసం రూ.20 వేలు అందించే పథకం లేదు ఎక్కడా లేవన్నారు. ఒకటో తరగతి చదివే విద్యార్థి తల్లికి రూ.15 వేలు ఆర్థిక సాయం చేయడం చూసి మధ్యప్రదేశ్ సీఎం ఆశ్చర్యపోయారని, లక్షలాది మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి S రూ.15 వేల చొప్పున ఇంత పెద్దమొత్తంలో నగదు ఎలా జమ చేస్తున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారన్నారు. ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలనే గొప్ప ఆశయంతో సీఎం వైయస్ జగన్ ముందడుగులు వేస్తున్నారన్నారు. సీఎం వైయస్ జగన్ పాలనలో గొప్పగా చదువుకునే అవకాశం బీసీ విద్యార్థులకు వచ్చిందన్నారు. సుపరిపాలన అందిస్తున్న ప్రభుత్వాన్ని మరింత ప్రోత్సహించి, భవిష్యత్తులో మరిన్ని సదుపాయాల కోసం సీఎం వైయస్ జగన్‌కు మద్దతుగా నిలవాలని బీసీ సంఘాలకు సూచించారు. సచివాలయ ఉద్యోగాలు, ఇతర ఏ ఉద్యోగాల్లో తీసుకున్నా 60–65 శాతానికి పైగా బీసీలు ఉన్నారని ఎంపీ ఆర్.కృష్ణయ్య గుర్తుచేశారు. జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, మేయర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డుమెంబర్లు మొత్తం లెక్కగడితే 60 శాతానికి పైగా పదవులు బీసీలకు ఇచ్చిన ఘనత సీఎం వైయస్ జగన్‌దన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు బీసీలకు ఇన్ని పదవులు ఇచ్చారా..? అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ బలోపేతానికి సీఎం వైయస్ జగన్ పెద్దపీట వేశారని ఎంపీ ఆర్.కృష్ణయ్య గుర్తుచేశారు.