పేదల జీవితానికి భరోసా, ధైర్యం ఇచ్చిన నాయకుడు వైయస్‌ జగన్‌

వైయస్‌ఆర్‌ సీపీ రాజ్యసభ సభ్యులు ఆర్‌. కృష్ణయ్య

చదువు వల్లే పేదరిక నిర్మూలన జరుగుతుందని సీఎం నమ్మారు

విద్యారంగానికి పెద్దపీట వేసి విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారు

20 ఏళ్లలో విద్యరంగంలో ఏపీ ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ స్థానానికి ఎదుగుతుంది

ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబడిన వర్గాలకు సముచిత స్థానం 

పేదల గుండెల్లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చిరస్థాయిలో నిలిచిపోతారు

ఓటు బ్యాంక్‌ కోసమే బాబుకు బీసీలు అవసరం.. ఆచరణలో బీసీ వ్యతిరేక చర్యే

ఒక్క బీసీ నాయకుడినైనా చంద్రబాబు రాజ్యసభకు పంపించాడా..?

తాడేపల్లి: పేదల జీవితానికి భరోసా, మానసిక ధైర్యాన్ని ఇచ్చిన గొప్ప నాయకుడు, ప్రజలను తన ఇంటి మనుషులుగా, వారి యోగక్షేమాలు చూసే మనసున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని వైయస్‌ఆర్‌ సీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ చేపట్టిన సంస్కరణలతో అన్ని వర్గాలు లబ్ధిపొందుతున్నాయన్నారు. విద్యకు సీఎం వైయస్‌ జగన్‌ పేదపీట వేశారని, పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదువుతున్నారని చెప్పారు. మరో 20 ఏళ్లలోపు విద్యరంగంలో ఆంధ్రరాష్ట్రం దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ స్థానానికి ఎదుగుతుందన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ ఆర్‌.కృష్ణయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఆర్‌.కృష్ణయ్య ఏం మాట్లాడారంటే..
ప్రతి ఒక్కరూ చదువుకొని డాక్టర్లు, ఇంజినీర్లు, కలెక్టర్లు వంటి పెద్ద పెద్ద చదువులు చదివి పేదరికం నుంచి బయటకు రావాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తపిస్తున్నారు. గుడిసెలో పుట్టిన నిరుపేద పిల్లలు కూడా పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకం ద్వారా ఇంజినీరింగ్, మెడిసిన్‌ చదువుతున్నారు. అమ్మఒడి, విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాలు అమలు చేస్తూ విద్యారంగానికి సీఎం వైయస్‌ జగన్‌ అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 20 సంవత్సరాల్లోపు ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే కాదు ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రంగా తయారవుతుంది. 

అమెరికా పర్యటన సందర్భంగా ఎయిర్‌పోర్టులో కలిసిన వారిని.. ఎవరిని అడిగినా ఏపీ నుంచి వచ్చాం.. ఇంజినీరింగ్‌ చదివి ఐటీ జాబ్‌ చేస్తున్నామని చెబుతున్నారు. ప్రపంచంలో ఉన్న ఎకానమీ వ్యవస్థ మీద కూడా ఏపీ డామినేషన్‌ చేసే స్థాయికి వచ్చింది. చదువు వల్లే బెంగళూరు, హైదరాబాద్, అమెరికా, కెనడా, ఇంగ్లాండ్‌లో ఏపీవారే ఆధిపత్యం చేసేస్థాయికి ఎదిగారు. చదువు ప్రభావం కులం, కుటుంబ గౌరవం పెంచుతుంది. ఈ విషయాన్ని సీఎం వైయస్‌ జగన్‌ గుర్తించి ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదవాలని ప్రోత్సహించడం చరిత్రాత్మక నిర్ణయం. దీని ప్రభావం దీర్ఘకాలంలో కనిపిస్తుంది. 

అధికారంలో, సంపదలో, విద్యలో ముఖ్యమంత్రి చేపట్టిన సంస్కరణలు ప్రపంచంలోనే ఏ నాయకుడు కూడా చేయలేదు. మంత్రివర్గంలో, ఎమ్మెల్సీ పదవుల్లో, నామినేటెడ్‌ పోస్టుల్లో, రాజ్యసభలో ఇలా మొత్తం కులానికి మించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవకాశం కల్పించారు. ఇటీవల వైయస్‌ఆర్‌ సీపీ తరఫున 18 మంది ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేస్తే.. అందులో 11 మంది బీసీలు. మంత్రివర్గంలో 11 మంది మంత్రులు బీసీ వర్గానికి చెందిన వారే. 

ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో మంత్రివర్గంలో బీసీలకు చోటు లేదు. గతంలో టీడీపీ బీసీల ప్రభుత్వం అని చెప్పుకునేది.. పేరుకే బీసీల ప్రభుత్వం కానీ, ఎక్కడా బీసీలకు ప్రాతినిధ్యం లేదు. చంద్రబాబు బీసీలను ఒక్కరిని కూడా రాజ్యసభకు పంపించలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా బీసీలు జడ్జిలుగా పనికిరారని కేంద్రానికి లెటర్‌ రాశారు. బీసీలను ఓటు బ్యాంక్‌ కోసం వాడుకొని, ఆచరణలో బీసీల వ్యతిరేక చర్యలకు పాల్పడిన చరిత్ర చంద్రబాబుది. 

అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం వైయస్‌ జగన్‌ బడ్జెట్‌ కేటాయిస్తున్నారు. రాష్ట్రంలో ఏకకాలంలో 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి అక్కచెల్లెమ్మలను ఇంటి యజమానులను చేశారు. పేదల సొంతింటి కల నెరవేర్చాలనే సీఎం నిర్ణయంతో రాష్ట్ర ప్రజలంతా నీరాజనం పలుకుతున్నారు. కర్నూలులో పర్యటనకు వెళ్లినప్పుడు ఒక బీసీ ఇంట్లో దేవుడి ఫొటోతో పాటు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఫొటో చూశాను.  ఎందుకని అడిగితే.. విద్యా దీవెన పథకం ద్వారా మా పిల్లలు ఉచితంగా పెద్ద చదువులు చదువుకుంటున్నారు.. వసతి దీవెన ద్వారా ఏటా రూ.20 వేల సాయం అందుతుంది.. ఇండ్ల స్థలాలు ఇచ్చారు.. ఇల్లు నిర్మించుకునేందుకు డబ్బులు ఇస్తున్నారు. మా కుటుంబంలో పేదరికం లేకుండా చేశాడు. గతంలో జీవనోపాధి లేక ఆత్మహత్య చేసుకుందామనుకున్నాం.. కానీ, జగనన్న వచ్చాక జీవితం మీద ధైర్యం కలిగిందని చెప్పాడు. 

పేదల జీవితానికి భరోసా, మానసిక ధైర్యాన్ని ఇచ్చిన గొప్ప నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌. పేదవారి గుండెల్లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చిరస్థాయిలో నిలిచిపోతారు. పేదలకు చదువు, ఉద్యోగాలు, జీవితంలో మరిచిపోలేని భరోసా ఇచ్చిన చరిత్ర సీఎం వైయస్‌ జగన్‌ది. కుల గణనతో బీసీ కులాలకు మరింత మంచి చేయాలనే చిత్తశుద్ధి సీఎంలో కనిపిస్తోంది. బీసీ మీటింగ్‌ కోసం తమిళనాడు, కర్ణాటక, ఒడిశాకు వెళ్తే ఏపీ బార్డర్‌లో నివసించే ఆ రాష్ట్ర ప్రజలంతా మమ్మల్ని ఏపీలో కలపాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

Back to Top