ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ స‌తీమ‌ణి మృతి ప‌ట్ల సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం

తూర్పుగోదావరి : మాజీ ఉప ముఖ్యమంత్రి, వైయ‌స్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ సతీమణి సత్యనారాయణమ్మ హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ప్రముఖ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.  స‌త్య‌నారాయ‌ణ‌మ్మ అకాల మ‌ర‌ణం ప‌ట్ల ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని, బాధ‌ను వ్య‌క్తం చేశారు. వారి కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతిని, సంతాపాన్ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ తెలియ‌జేశారు.  స‌త్య‌నారాయ‌ణ‌మ్మ అంత్యక్రియలు ఇవాళ‌ మధ్యాహ్నం జరగనున్నాయి. సత్యనారాయణమ్మ మరణ వార్త తెలుసుకున్న పిల్లి అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు పెద్ద ఎత్తున హసనాబాద్‌కు చేరుకుంటున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top