చంద్ర‌బాబుకు సింగిల్‌గా పోటీచేసే ద‌మ్ము లేదు

అందుకే దత్తపుత్రుడితో కలిసి బాబు కుయుక్తులు

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగం సురేష్‌

విజయవాడ: ఎన్నిక‌ల్లో సింగిల్‌గా పోటీచేసే ద‌మ్ము చంద్ర‌బాబుకు లేద‌ని స్ప‌ష్ట‌మైపోయింద‌ని, స‌త్తా లేదు కాబ‌ట్టే క‌ల‌సి రండి అంటూ అడుక్కుంటున్నాడ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. ద‌త్త‌పుత్రుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో క‌లిసి కుయుక్తులు ప‌న్నుతున్నాడ‌ని, ఎన్ని కుట్ర‌లు చేసినా.. ఎంత‌మంది క‌లిసి వ‌చ్చినా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని క‌దిలించ‌లేర‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఎంపీ నందిగం సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైయ‌స్‌ జగన్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందన్నారు. కానీ, ప్రతిపక్షానికి అది సహించడం లేదని, అందుకే ప్ర‌భుత్వంపై దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీచేసే ద‌మ్ములేని చంద్ర‌బాబు.. పొత్తుల కోసం పాకులాడుతున్నాడ‌న్నారు.

ఎన్నిక‌లు ఏవైనా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంట‌రిగానే పోటీ చేస్తుంద‌ని, గతంలో రెండుసార్లు (2014- 2019) వైయ‌స్‌ జగన్.. ఎలాంటి పొత్తు లేకుండా పోటీచేశారని ఎంపీ నందిగం సురేష్ గుర్తుచేశారు. తెలుగుదేశం ఎప్పుడూ పొత్తుల కోసం వెంప‌ర్లాడుతుంద‌ని, సింగిల్‌గా పోటీచేసే ధైర్యం టీడీపీకి లేద‌న్నారు. అత్యాచారాలు, మహిళలపై  దాడుల అంటూ ప్ర‌భుత్వంపై తెలుగుదేశం పార్టీ విష‌ప్ర‌చారం చేస్తోంద‌ని మండిప‌డ్డారు. చంద్ర‌బాబు పాల‌న‌లోనే రాష్ట్ర ప్రజలు అనేక క‌ష్టాలు అనుభ‌వించార‌ని గుర్తుచేశారు. వైయ‌స్ఆర్ సీపీ అధికారంలోకి వ‌చ్చాక ప్ర‌జ‌లంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం మళ్లీ వైయ‌స్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చేలా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. 

Back to Top