రైతుల గుండెల్లో తూటాలు దించిన చరిత్ర చంద్రబాబుది

బెదిరింపులకు దిగినవారిని అరెస్టు చేస్తే రైతుల రంగు పులుముతారా..?

ద‌ళితుల‌ను అడ్డుపెట్టుకొని చంద్ర‌బాబు రాజ‌కీయం చేస్తున్నారు

ద‌య‌చేసి ద‌ళిత సోద‌రులంతా గ‌మ‌నించాలి

నిజమైన రైతుల‌కు మా ప్రభుత్వంలో అన్యాయం జ‌ర‌గ‌దు

చంద్రబాబుపై దాడి చేసిన దళితుడిని వదిలేస్తారా..?

టీడీపీ హయాంలో రైతులకు అన్యాయం జరిగితే ఈ దళిత మేధావులు ఏమయ్యారు

సీఎం వైయస్‌ జగన్‌ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారు

వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ నందిగం సురేష్‌

తాడేపల్లి: అమరావతి రైతుల జీవితాలతో ఆడుకున్నది.. ఆడుకుంటున్నది చంద్రబాబేనని, అధికారంలో ఉండగా తన సామాజిక వర్గానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే బాబు.. అధికారంలో కోల్పోయాక దళితులను అడ్డంపెట్టుకొని డ్రామాలు ఆడుతున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ నందిగం సురేష్‌ ధ్వజమెత్తారు. దీక్షలు,ధర్నాల చేసి అరెస్టు అయితే సమర్థించవచ్చు.. కానీ గొడవలకు దిగి..  చంపుతామని బెదిరించిన వ్యక్తులను అరెస్టు చేస్తే, రైతులు, దళితుల రంగు పులుముతారా..? అని ప్రశ్నించారు. దళిత మేధావులు అని చెప్పుకుంటూ చంద్రబాబుకు తొత్తులుగా మారిన వ్యక్తులు కూడా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంఓ ఎంపీ నందిగం సురేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే..

‘మూడు రాజ‌ధానుల‌కు మ‌ద్ద‌తుగా, ఇళ్ల స్థలాలు రాకుండా అడ్డుకున్న పార్టీకి, వ్యక్తులకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న పేదలను అస‌లు ట్రాక్టర్‌తో తొక్కించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. హ‌త్య‌లు, గొడ‌వ‌లు చేయాల‌ని చూసిన కొంద‌రు వ్య‌క్తులు అరెస్టు అయ్యారు. అరెస్టు అయిన తరువాత అమరావతి రైతులు అని ఎందుకు పులుముకుంటున్నారు. జరిగిన సంఘటనకు పూర్తి విరుద్ధంగా కొందరు  వ్యక్తులు వ్యవహరిస్తున్నారు. దళిత మేధావులు అని చెప్పుకుంటూ చంద్రబాబు తొత్తులుగా మారిన కొందరు మాట్లాడుతున్నారు. 

2014లో చంద్రబాబు గెలిచిన తరువాత రాజధాని ప్రాంతంలో అసైన్డ్‌ భూములు అన్యాక్రాంతం జరిగి రైతులు రోడ్డు ఎక్కి, అరెస్టు అయిన సందర్భంలో ఈ మేధావులు ఎక్కడకు వెళ్లారు..? ఆ రోజున రైతులు దళితులు కాదా..? చంద్రబాబు దుర్మార్గాలకు ఇబ్బందులు పడిన వ్యక్తులు కాదా..? ఆరోజు ఏమైపోయారీ మేధావులు.

రాజధాని ప్రాంతంలో 48 గంటలు నన్ను అరెస్టు చేసి నానా హింసలు పెట్టినప్పుడు ఎవరైనా వచ్చి పరామర్శించారా..? నేను దళితుడినే అని గుర్తులేదా.? ఎంపీ అయిన తరువాత అనేక సార్లు నాపై దాడి చేశారు. ఈ మధ్యకాంలో ఒక వ్యక్తి ఇంటికి వచ్చి ఇనుప రాడ్డుతో దాడికి యత్నించాడు. ఇది దళిత మేధావులకు కనిపించడం లేదా..? 

వాస్తవానికి మొన్న జరిగిన గొడవలో ఎవరు ఎలాంటి దుర్భాషలాడారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అధికారంలో ఉన్నప్పుడు తన సామాజికవర్గాన్ని మాత్రమే వెంట తిప్పుకుని వారికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే చంద్రబాబు.. వారిని అడ్డుకోవాలనప్పుడు తన సామాజికవర్గాన్ని ముందుపెట్టవచ్చు కదా..? దళితులను ముందుపెట్టి వారి జీవితాలతో ఆడుకోవడానికి మీరెవరు.?

చంద్రబాబుకు అధికారం కోల్పోయినప్పుడు మాత్రమే దళితులు, బీసీలు గుర్తుకొస్తారు. చంద్రబాబు దళితుల భూములు లాక్కుంటే.. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అదే ప్రాంతంలో 53 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. దళితుల పట్ల ఎవరికీ నిజమైన ప్రేమ ఉందో దీన్ని బట్టే అర్థం అవుతుంది.

చంద్రబాబు రాజధాని ప్రాంతంలోకి వస్తే దళితుడు దాడి చేయడానికి ప్రయత్నిస్తే వదిలేస్తారా..? తప్పు ఎవరు చేసినా ఒకటే అది చెప్పడమే మా ఉద్దేశం. నిన్న రైతులకు బేడీలు వేశారని తెలిసింది వెంటనే రియాక్ట్‌ అయి అందుకు కారణమైన వారిని సస్పెండ్‌ చేశాం. 

గతంలో కరెంట్‌ చార్జీల పెంపుపై బషీర్‌బాగ్‌లో రైతులు ఆందోళన చేస్తే అన్నదాతల గుండెల్లోకి తూటాలు దించిన నీచ చరిత్ర చంద్రబాబుది. ఇసుక రీచ్‌ల వద్ద దోపిడీకి అడ్డుపడుతున్నారని 10 మందిని భారీ వాహనాలతో తొక్కిచ్చి చంపింది చంద్రబాబు. పుష్కరాల్లో ఎంతమందిని చంపాడో అన్నీ ప్రజలకు తెలుసు. 

అమరావతి రైతుల జీవితాలతో ఆడుకున్నది చంద్రబాబు. అమరావతిలో రియలెస్టేట్‌ దందా తప్ప అభివృద్ధి చేశారా..? రైతులకు ఇచ్చిన ప్లాట్లు కాగితాల మీద తప్ప.. క్షేత్రస్థాయిలో చూపించారా..? 

రాష్ట్ర దళితులు, గిరిజనులు, బీసీ, మైనార్టీలు టీడీపీని ఓడించారు కాబట్టి వాళ్ల జీవితాలతో ఆడుకోవాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు బాగుపడకూడదని ప్రతీ కార్యక్రమాన్ని చంద్రబాబు అడ్డుకుంటున్నాడు. 

దళితుల బతుకులు మార్చేందుకు సీఎం వైయస్‌ జగన్‌ ఉన్నారు. కేసుల విషయంలో అన్యాయం జరిగితే తగిన న్యాయం చేస్తాం’ అని ఎంపీ నందిగం సురేష్‌ అన్నారు. 

తాజా వీడియోలు

Back to Top