ఎన్నికల్లో ఓడించారనే దళితులపై చంద్రబాబుకు పగ

దళితులపై దాడి వెనక బాబు పాత్ర కూడా ఉంది

వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున

తాడేపల్లి: చంద్రబాబు దళిత ద్రోహి అని మరోసారి నిరూపించుకున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. దళితులపై దాడి చేసిన టీడీపీ నేత దేవినేని ఉమా కుటుంబాన్ని పరామర్శించేందుకు చంద్రబాబు రావడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు తీరుపై ఎంపీ నందిగం సురేష్‌ మాట్లాడుతూ.. పాము పగబట్టినట్టు చంద్రబాబు దళితులపై పగబట్టారని, దళితులపై దాడి చేసిన దేవినేని ఉమా ఇంటికి చంద్రబాబు ఎలా వెళ్తారు..? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓడించారనే కక్షతోనే దళితులపై టీడీపీ దాడులకు తెగబడుతోందని మండిపడ్డారు. ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. చంద్రబాబు మరోసారి దళిత ద్రోహి అని నిరూపించుకున్నారని, దళితులపై దాడి వెనక చంద్రబాబు పాత్ర కూడా ఉందన్నారు.  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top