పక్కా ప్రణాళికతోనే నాపై దాడికి య‌త్నం

ద‌ళితుడు ఎంపీ అయితే జీర్ణించుకోలేక‌పోతున్నారు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ నందిగం సురేష్‌

అమరావతి: మారణాయుధాలతో తనపై దాడి చేయడానికి ఓ వ్యక్తి వచ్చాడంటే.. ఇది పక్కా ప్రణాళితోనే జరిగిందని భావిస్తున్నానని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ నందిగం సురేష్‌ అన్నారు. దళితుడు ఎంపీ అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఇప్పటి వరకు తనపై ఐదుసార్లు దాడికి యత్నించారన్నారు. ఎంపీ నందిగం సురేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ కార్యకర్త బత్తుల పూర్ణచంద్రరావు తనపై దాడికి యత్నించాడని, తనను అసభ్యపదజాలంతో దూషించాడని మండిపడ్డారు. ‘కేసు పెడితే గంటలో బయటకు వస్తా.. కోర్టుకు వెళ్తే రోజులో బయటకు వస్తానంటూ’ అతడు మాట్లాడుతున్నాడని ఎంపీ సురేష్‌ తెలిపారు. తనపై దాడి చేసేందుకు పక్కా ప్రణాళికతోనే వచ్చాడన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top