చంద్రబాబు దళిత వ్యతిరేకి

వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ నందిగం సురేష్‌

తాడేపల్లి: అధికారంలో ఉండగా దళితులను అడుగడుగునా అవమానించిన చంద్రబాబు.. అధికారం కోల్పోయాక కపట ప్రేమ చూపిస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ సభ్యులు నందిగం సురేష్‌ అన్నారు. చంద్రబాబు దళిత వ్యతిరేకి అని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ నందిగం సురేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితులపై ఎవరైనా దాడులు చేస్తే సహించేది లేదని, దళితులపై దాడులు జరిగితే సీఎం వైయస్‌ జగన్‌ వెంటనే చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఎంతటివారైనా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని గుర్తుచేశారు. కరోనా కష్టకాలంలో చంద్రబాబు హైదరాబాద్‌లో దాక్కున్ని రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లేందుకు కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారని మండిపడ్డారు.  

తాజా వీడియోలు

Back to Top