రంగాను వెలగపూడి ఎలా చంపారో ఆధారాలు బయలపెడతా!

ఎంపీ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ సీరియ‌స్ కామెంట్స్‌

విశాఖపట్నం: రంగాను చంపిన వ్యక్తి వెలగపూడి అని  వైయ‌స్ఆర్‌సీపీ ఎంవీవీ సత్యనారాయణ సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. అలాగే, ఎమ్మెల్సీ వంశీ ఒక అవివేకి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 ఎంపీ ఎంవీవీ తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘రంగాను చంపి పారిపోయి వైజాగ్‌ వచ్చిన వ్యక్తి వెలగపూడి. కాపుల ఓట్ల కోసం పవన్‌ ఫొటో పెట్టుకుని తిరుగుతున్నారు. రంగాను వెలగపూడి ఎలా చంపారో ఆధారాలు బయలపెడతాను. ఎమ్మెల్సీ వంశీ ఒక అవివేకి. వంశీ చెబితే ఓడించేస్తారు అనుకుంటే ఆయన ఎందుకు గెలవలేకపోయారు. వంశీ మీద చెక్‌ బౌన్స్‌ కేసులు ఎన్నో ఉన్నాయి. 

వంశీ ఎంతో మంది డబ్బులు ఎగ్గొట్టారు. సీటు లేక వంశీ ఫస్ట్రేషన్‌కు గురవుతున్నారు. మేయర్ పదవి స్థానికంగా ఉన్న యాదవులకు ఇస్తే తప్పేంది. వైయ‌స్ఆర్‌సీపీకి వెన్నుపోటు పొడిచిన వంశీ. పవన్‌ కల్యాణ్‌ను వంశీ ఎన్నోసార్లు తిట్టారు. వంశీ చిత్త కార్తి కుక్కతో సమానం. బాబు మోహన్, బ్రహ్మానందంలా కామెడీ యాక్టర్ వంశీ. అతడిలాగా నేను చిల్లర వ్యక్తిని కాదు’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

Back to Top