ఈ వినాయ‌క చ‌వితితో అడ్డంకుల‌న్ని తొల‌గిపోతాయి

వైయ‌స్ఆర్ ‌సీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ

 విశాఖపట్నం: రాష్ట్రాభివృద్ధికి ఎదురవుతున్న అన్ని అడ్డంకులు ఈ వినాయక చవితితో తొలగి సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ఆశాభావం వ్యక్తం చేశారు. వినాయక చవితి సందర్భంగా ఆశీల్మెట్టలోని సంపత్ వినాయక ఆలయాన్ని శనివారం ఆయన సందర్శించారు. రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువస్తున్న ఎన్నో విప్లవాత్మక సంస్కరణలకు ప్రతి పక్ష నేత చంద్రబాబు అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబును ప్రతిపక్ష నేత అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉందన్నారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం వైయ‌స్ జగన్‌కు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తున్నానన్నారు.  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top