పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తిచేయాలని కోరాం

వైయస్‌ఆర్‌ సీపీ లోక్‌సభ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి

రైల్వే జీఎం గజానన్‌తో ఎంపీల భేటీ
 

విజయవాడ: పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని రైల్వే జీఎం గజానన్‌ను కోరామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ పక్షనేత ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చెప్పారు. విజయవాడలో రైల్వే జీఎం గజానన్‌తో ఎంపీలు భేటీ అయ్యారు. అభివృద్ధిపై రైల్వే జీఎంకు ఎంపీలు ప్రతిపాదనలు అందించారు. విశాఖ డివిజన్‌లో వాల్తేరు అలాగే ఉండాలని రైల్వే జీఎంను కోరినట్లు ఎంపీ మిథున్‌రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించి పార్లమెంట్‌లో గట్టిగా పోరాటం చేస్తామన్నారు. రాబోయే ఐదేళ్లలో ఎలాంటి పనుల్లో చేపట్టాలో భేటీలో చర్చించినట్లు వివరించారు. అనంతపురంలో రైల్వే ప్రాజెక్టులకు ప్రాధాన్యత కల్పించాలని, కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ రైలుకు అనంతలో హాల్ట్‌ ఇవ్వాలని కోరినట్లు ఎంపీలు మాధవ్, రెడ్డప్పలు వివరించారు. దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాలు భర్తీ చేయాలని, అమరావతికి వచ్చేలా అన్ని ప్రాంతాల నుంచి రైళ్లు ఉండాలని జీఎంకు వివరించినట్లు ఎంపీ వంగా గీత పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top