బీసీలంతా సీఎం వైయస్‌ జగన్‌కు రుణపడి ఉంటారు

వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ మార్గాని భరత్‌

ఏలూరు: బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మార్గాని భరత్‌ అన్నారు. ఏలూరు వేదికగా జరిగిన బీసీ గర్జనలో బీసీలకు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తున్నారన్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరక్టర్లకు అభినందన సభ ఏలూరు పాత బస్టాండ్ దగ్గర ఆదిత్య హోటల్లో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రి తానేటి వనిత, ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు కొఠారు అబ్బాయచౌదరి, జీఎస్‌ నాయుడు, ఏలీజా, కారుమూరి నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఎంపీ మార్గాని భరత్‌ మాట్లాడుతూ.. దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించే విధంగా బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అందులోనూ 50 శాతం మహిళలకు పదవులు కేటాయించిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌దన్నారు. బీసీ గర్జనలో ఇచ్చిన ప్రతీ హామీని సీఎం అమలు చేస్తున్నారన్నారు.  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి బీసీలు ఎల్లవేళలా రుణపడి ఉంటారన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top