విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపాలి

కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి

లోక్‌సభలో వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ డిమాండ్‌

న్యూఢిల్లీ: స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. క్యాపిటీవ్‌ మైన్స్‌ కేటాయించాలని కోరారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేయొద్దని, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానమంత్రికి లేఖ రాశారని గుర్తుచేశారు. విశాఖ ఉక్కు– ఆంధ్రుల హక్కు నినాదంతో 32 మంది ప్రాణత్యాగాలతో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పడిందన్నారు. వేలాది ఎకరాల భూమిని ప్రజలు స్వచ్ఛందంగా ప్లాంట్‌ ఏర్పాటుకు ఇచ్చారని గుర్తుచేశారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు ప్రజలు ఎవరూ ఒప్పుకోరని, కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా ప్రధానమంత్రి, సంబంధింత శాఖ మంత్రిని ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ కోరారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top