రియల్‌ ఎస్టేట్‌ కోసమే అమరావతి టు అరసవెల్లి పాదయాత్ర

రాష్ట్ర సంపదనంతా 29 గ్రామాల్లో పెట్టాలా..?

వికేంద్రీకరణతోనే రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుంది

పరిపాలన రాజధానిగా విశాఖకు అన్ని అర్హతలున్నాయి

అమరావతి మాత్రమే రాజధాని కావాలనే బాబు, దత్తపుత్రుడు నివాసం ఎక్కడుంది..?

ముఖ్యమంత్రిగా ఐదేళ్లు చంద్రబాబు అమరావతికి ఏం చేశాడు..?

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ 

తాడేపల్లి: అమరావతిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రైతుల ముసుగులో అమరావతి టు అరసవెల్లి పాదయాత్ర చంద్రబాబు నాయుడు డైరెక్షన్‌లో జరుగుతోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ అన్నారు. రాష్ట్రాన్ని మొత్తం అంధకారంలో నెట్టేసి.. రాష్ట్ర సంపదనంతా అమరావతిలోని 29 గ్రామాల్లో కుమ్మరించాలనే కుట్రతో పాదయాత్ర జరుగుతోందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేది వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం, సీఎం వైయస్‌ జగన్‌ లక్ష్యమన్నారు. అమరావతి రాజధాని కాదని తాము ఎప్పుడూ, ఎక్కడా చెప్పలేదని గుర్తుచేశారు. అమరావతితో పాటు విశాఖ, కర్నూలు కూడా రాజధానులు ఉంటే వెనుకబడి ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనేది ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నిర్ణయమన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 70 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్‌లో లక్షల కోట్ల రాష్ట్ర సంపదనంతా పెట్టుబడిగా పెట్టామని, రాష్ట్ర విభజనతో హైదరాబాద్‌ తెలంగాణకు వెళ్లిపోయి.. ఏపీకి తీరని అన్యాయం జరిగిందన్నారు. అలాంటి పరిస్థితి మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే రాష్ట్రంలోని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు వ్యతిరేకంగా ట్వీట్లు, మీడియా మీట్లు పెడుతున్న చంద్రబాబు, లోకేష్, దత్తపుత్రుడు ఎక్కడ నివాసం ఉంటున్నారని ప్రశ్నించారు. అమరావతి మాత్రమే క్యాపిటల్‌ కావాలని కోరుకుంటున్న ఈ ముగ్గురు ఎందుకు ఆ ప్రాంతంలో నివాసం ఉండటం లేదని నిలదీశారు. 

అమరావతి రాజధాని కాదు అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఎక్కడా చెప్పలేదని ఎంపీ మార్గాని భరత్‌ గుర్తుచేశారు. అమరావతి ప్రాంతంలోనే సీఎం వైయస్‌ జగన్‌ సొంతంగా ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారన్నారు. ఇవాళ ఒక వ్యక్తి, ఒక కులం, ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలనే స్వార్థబుద్ధి ఎవ్వరికీ ఉండకూడదని, రాష్ట్రమంతా సమగ్రంగా అభివృద్ధి చెందాలని ప్రజలంతా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. 5 సంవత్సరాలు విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు అమరావతి ప్రాంతానికి ఏం తీసుకొచ్చారని ఎంపీ మార్గాని భరత్‌ ప్రశ్నించారు. బాహుబలి సినిమా డైరెక్టర్‌తో సెట్లు వేయమని, అమరావతి సింగపూర్‌ అయిపోతుందని అభూత కల్పనలు సృష్టించాడని మండిపడ్డారు. రైతుల ముసుగులో పాదయాత్ర రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం పాదయాత్ర చేయిస్తున్నాడని, 30 వేలమంది రైతులు అని ప్రచారం చేసుకుంటున్నారని, ఆ 30 వేల మంది రాత్రి ఎక్కడ బస చేస్తున్నారని ఎంపీ భరత్‌ ప్రశ్నించారు. ముగ్గురుకి ఒక రూమ్‌ చొప్పున కేటాయించినా.. 10 వేల రూములు కావాలని, పాదయాత్ర సాగే పల్లెల వెంబడి 10 వేల రూములు ఉంటాయా..? మినిమం లాజిక్‌ మరిచిపోయి ఎల్లోమీడియాతో ప్రచారం చేయించుకుంటున్నారని దుయ్యబట్టారు. 

విశాఖపట్నం ప్రాంతంలో భోగాపురం ఎయిర్‌పోర్టుకు కేంద్రం క్లియరెన్స్‌ ఇచ్చిందని, మరో 36 నెలల్లో విశాఖలో సమీపంలో అంతర్జాతీయ విమానాశ్రయం తయారవ్వబోతుందన్నారు. విశాఖకు ట్రాఫిక్‌Sక్లియరెన్స్‌ కోసం 12 ఫ్లైఓవర్స్‌ మంజూరయ్యాయని ఎంపీ భరత్‌ చెప్పారు. పరిపాలన రాజధానిగా విశాఖ అన్ని విధాలుగా అనువైన ప్రాంతమని స్పష్టం చేశారు. 
 

తాజా వీడియోలు

Back to Top