అసాంఘిక శక్తులకు రారాజు చంద్రబాబు

రాష్ట్ర యువతపై డ్రగ్స్‌ నెపం మోపుతున్న టీడీపీ

పదవి, అధికారం లేకపోయేసరికి రాష్ట్ర పరువు తీస్తున్న చంద్రబాబు

ఆ పదం ఢిల్లీలో వాడితే చెప్పుతో కొడతారు

ఎన్నికల్లో గెలవలేక ఆర్టికల్‌ 356, ప్రెసిడెంట్‌ రూల్‌ అంటూ బాబు డ్రామాలు

చంద్రబాబును అరెస్టు చేసి అండమాన్‌ లాంటి దీవుల్లో వేయాలి

రాష్ట్రపతికి వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ మార్గాని భరత్‌ విజ్ఞప్తి

తాడేపల్లి: ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. అక్కడి పెద్దలను క్యారే బోసడీకే అని పిలుస్తున్నారా..? అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మార్గాని భరత్‌ ప్రశ్నించారు. ఆ పదం ఢిల్లీలో వాడితే అక్కడివారు చెప్పుతో కొడతారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని యువతపై డ్రగ్స్‌ నెపం మోపుతూ.. రాష్ట్ర పరువును తీయడానికి చంద్రబాబు ఢిల్లీ వెళ్లాడని, పదవి, అధికారం లేకపోతే రాష్ట్ర పరువు తీస్తావా..? అని ఎంపీ భరత్‌ ధ్వజమెత్తారు. చంద్రబాబు నీచ రాజకీయాలను, కుటిలబుద్ధిని ప్రజలంతా గమనించాలన్నారు. అసాంఘిక శక్తులకు రారాజు చంద్రబాబు తయారయ్యాడని మండిపడ్డారు. ఢిల్లీకి వచ్చి దేశ ప్రథమ పౌరుడికి అబద్ధాలు, అవాస్తవాలు చెప్పినందుకు చంద్రబాబు, అండ్‌ కోను వెంటనే అరెస్టు చేసి.. అండమాన్‌ లాంటి దీవుల్లో వేయాలని రాష్ట్రపతిని ఎంపీ మార్గాని భరత్‌ విజ్ఞప్తి చేశారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ మార్గాని భరత్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఢిల్లీకి రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్లావా..? రాష్ట్రం పరువు తీయడానికి వెళ్లావా..? అని ప్రశ్నించారు. వైశ్రాయ్‌ హోటల్‌లో ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించినప్పుడు ఢిల్లీకి వెళ్లి.. అక్కడి పెద్దలను మభ్యపెట్టాడని, ఓటుకు కోట్ల కేసు సమయంలో ఢిల్లీ వెళ్లి ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టాడన్నారు. 6 కోట్ల ఆంధ్రరాష్ట్ర ప్రజలకు ప్రతినిధి అయిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను తన దగ్గరున్న పనికిమాలిన సన్నాసులతో తిట్టించి.. ఆ బూతులను సమర్థిస్తూ 36 గంటలు దీక్ష చేసిన చంద్రబాబు.. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకోవడం దారుణమన్నారు.  

రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం, మహిళా రాజ్యం నడుస్తుందని, బడుగు, బలహీనవర్గాలకు సీఎం వైయస్‌ జగన్‌ అగ్రతాంబూలం వేస్తున్నారన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఆంధ్రరాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాలకు, మహిళలకు పెద్దపీట వేస్తుంటే చంద్రబాబు కడుపు మండుతుందని, ఎన్నికల్లో గెలవలేక 356 ఆర్టికల్, ప్రెసిడెంట్‌ రూల్‌ ఇంప్లిమెంట్‌ చేయాలని కుట్రలు పన్నుతున్నాడని మండిపడ్డారు. బోసడీకే అంటే బాగున్నారా అని అర్థం అని తెలుగుదేశం నేతలు చెబుతున్నారని, ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. అక్కడి పెద్దలను క్యారే బోసడీకే అని పిలుస్తున్నారా..? ఆ పదం ఢిల్లీలో వాడితే చెప్పుతో కొడతారన్నారు. 

గతంలో ప్రధాని మోడీని తిట్టిన సీడీలు చూపించడానికి చంద్రబాబు ఢిల్లీ వెళ్లాడా..? లేక తిరుపతిలో అమిత్‌షాని రాళ్లతో దాడి చేసిన వీడియోలు చూపించడానికి వెళ్లాడా అని ఎంపీ మార్గాని భరత్‌ ప్రశ్నించారు. మత, కుల రాజకీయాలు అయిపోయాయి.. కొత్తగా డ్రగ్స్‌ రాజకీయాలు తీసుకువస్తూ దాంట్లో బూతు రాజకీయాలు యాడ్‌ చేస్తున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబును మూడు సార్లు ముఖ్యమంత్రిని ఎలా చేశారని ఆశ్చర్యమేస్తుంద‌న్నారు. 

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు గంజాయి విశాఖ నుంచే సరఫరా అవుతుందని మాట్లాడిన మాటలు చంద్రబాబుకు గుర్తులేదా..? అని ప్రశ్నించారు. స్కూల్‌ బస్సుల్లోనే గంజాయి తరలించేవారని గంటా మాట్లాడారని గుర్తుచేశారు. ఒడిశా – ఆంధ్ర బార్డర్‌ (ఓఏబీ) ప్రాంతంలో ఎప్పటి నుంచో ఉన్న గంజాయి సాగును కూకటివేళ్లతో పెకిలించేందుకు పోలీస్‌ యంత్రాంగం కృషిచేస్తుందని, పోలీసుల దాడులు జరినప్పుడు అన్నీ బయటకు వస్తున్నాయని, గంజాయిని నిర్మూలిస్తుంటే.. దాన్ని ప్రభుత్వానికి అంటగట్టి బురదజల్లుతున్నారని ధ్వజమెత్తారు. 

‘‘గుజరాత్‌లో పట్టుబడిన హెరాయిన్‌తో ఏపీకి సంబంధం లేదని ఎన్‌ఐఏ క్లిన్‌ చిట్‌ ఇచ్చింది. మరి గుజరాత్‌ ప్రభుత్వంపై ఎందుకు ఆరోపణలు చేయడం లేదు..? చేస్తే తోలు వలిచేస్తారని బాబుకు తెలుసు.. ముంబాయి డ్రగ్స్‌ గురించి మాట్లాడితే శివసేన వారు నడుం విరిచేస్తారని తెలుసు.. హైదరాబాద్‌లో చంద్రబాబు చుట్టాలు డ్రగ్స్‌ వాడుతున్నారని బహిరంగంగా చెప్పుకుంటున్నారు.. మరి కేసీఆర్‌ మీద మాట్లాడితే ఓటుకు కోట్ల కేసు బయటపెడతారని భయం.. వాటి గురించి మాట్లాడలేక.. ఆంధ్రప్రదేశ్‌లోని యువతపై నెపం మోపుతూ.. అబద్ధాలతో రాష్ట్ర పరువును ఢిల్లీలో తీస్తున్నాడని, చంద్రబాబు నీచ రాజకీయాలను ప్రజలంతా గమనించాలి’’ అని ఎంపీ మార్గాని భరత్‌ అన్నారు. 
 

Back to Top