ఆనందయ్య మందుతో చక్కటి రిజల్ట్స్‌

మందు పంపిణీకి ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తోంది

వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి

నెల్లూరు: కరోనా బాధితుల కోసం ఆనందయ్య తయారు చేసిన మందుతో చక్కటి రిజల్ట్స్‌ వస్తున్నాయని వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ఆనందయ్యను కలిసిన ఎంపీ మాగుంట.. ఆయనకు అభినందనలు తెలిపి.. ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట మాట్లాడుతూ.. ఆనందయ్య మందు పంపిణీకి ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తోందన్నారు. ప్రజలందరినీ మందుతో నయం చేయాలని కోరానని చెప్పారు. అదే విధంగా ఒంగోలుకు వచ్చి ప్రకాశం జిల్లా వాసులకు కూడా కరోనా నుంచి విముక్తి కల్పించాలని కోరానన్నారు. మందు తయారీకి కావాల్సిన మూలికలను ప్రకాశం జిల్లా సమీపంలో ఉన్న నల్లమల ఫారెస్ట్‌ నుంచి సమకూర్చుతామన్నారు. ఆనందయ్య మందు వాడుతున్నవారి నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top