రివర్స్ టెండరింగ్‌లో 15 శాతం  వరకు సేవ్ 

సచివాలయ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించారు

వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు

 పశ్చిమ గోదావరి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ,వార్డు సచివాలయ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించారని వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. పరీక్ష పత్రాలు లీక్‌ అయితే ముందుగానే మాట్లాడాలని, నిష్పక్షపాతంగా జరిగిన పరీక్షలపై కామెంట్‌ చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం పశ్చిమ గోదావరి జిల్లా  కాళ్ల మండలం  పెద్ద అమిరం నర్సాపురం ఎంపీ క్యాంప్ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ..  ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన  పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్‌లో 15 శాతం  వరకు సేవ్ అయ్యిందన్నారు.

మొత్తం ప్రాజెక్టులో రూ. 600 కోట్ల వరకు సేవ్ అవుతుందని అంచనా వేశారు. తన నియోజకవర్గంలో మహాత్మాగాంధీ 150వ జన్మదినం సందర్భంగా ప్రతి గ్రామంలోనూ 150 మొక్కలు నాటుతామన్నారు. రాజధాని నిర్మాణంలో వర్షం కురుస్తున్న భవనాలు నాసిరకమో, వాసిరకమో చంద్రబాబునాయుడు చెప్పాలన్నారు. వశిష్ఠ వారధి నిర్మాణానికి  అక్టోబర్‌ శంకుస్థాపన జరుగుతుందని తెలిపారు.
 

Back to Top