బాధ్యత లేని వ్యక్తులను మళ్లీ ఎందుకు గెలిపించాలి

ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌

 శ్రీకాకుళం: టీడీపీ నేతలకు బాధ్యత లేదని, అలాంటి వ్యక్తులను ఎందుకు మళ్లీ గెలిపించాలని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ ప్రశ్నించారు. ఎంపీగా గెలిచిన తరువాత ఒక్క రోజు కూడా ఒక్క గ్రామాన్ని కూడా చూడలేదన్నారు. పలాస పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారుఎన్నికలకు ముందు ఇచ్చాపురం, పలాస, హరిశ్చద్రపురం కోట బొమ్మలి రైల్వే స్టేషన్‌ను బాగు చేస్తామన్నారు. రైల్వే స్టేషన్లలో కనీసం తాగేందుకు నీరు లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి రూ.250 కోట్లు ఇస్తే. ఎంపీ ల్యాండు రూ.10 కోట్లు వస్తే వాటిని వినియోగించలేదన్నారు. ఆ నిధులు వెనక్కి వెళ్లాయని చెప్పారు. గతంలో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధకృష్ణ ఓ డిబెట్‌లో శ్రీకాకుళం ప్రజలకు మాట్లాడేందుకు భాష రాదంటే..మనం ఎన్నుకున్న ఎంపీ అంగీకరించి మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కష్టాల్లో ఉన్నారన్నారు. అగ్రిగోల్డులో దాచిన డబ్బులను దోచుకున్నారని, ఆ ఆస్తులను చంద్రబాబు, ఆయన కుమారుడు మిస్టర్‌ పప్పు కాజేసేందుకు కుట్రలు చేశారన్నారు. అలాంటి వ్యక్తులను చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. అగ్రిగోల్డు బాధితుల సమస్యలను పరిష్కరిస్తారని మాట ఇచ్చారన్నారు. వైయస్‌ జగన్‌ అంటే మడమ తప్పని నేత అని, వైయస్‌ఆర్‌ కుటుంబం గొప్పదని, నీతికి, నిజాయితీకి కట్టుబడి ఉన్న నేత అన్నారు. చంద్రబాబు ఈ రోజు టికెట్లు ఇవ్వాలంటే ఎంత డబ్బు ఉంది..ఎంత ఖర్చు చేస్తావు అంటారన్నారు. తాను ఆర్థికంగా వెనుకబడినా వ్యక్తిని అయినా కూడా నాకు సీటు ఇచ్చి వైయస్‌ జగన్‌ తోడుగా ఉన్నారని కొనియాడారు. మా లాంటి అభాగ్యుడికి, సామాన్యుడికి టికెట్టు ఇచ్చారని భావోద్వేగానికి గురయ్యారు. జన్మ జన్మలకు రుణపడి ఉంటానని చెప్పారు. ఏ నమ్మకంతో నాకు టికెట్టు ఇచ్చావో ఆ నమ్మకంతో పని చేస్తానని ప్రమాణం చేసి చెప్పారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top