ఉగ్రవాద సంస్థలా పనిచేస్తున్న ఐ-టీడీపీ

గీతాంజలిని టీడీపీ, జనసేన సైకోలే హత్య చేశారు

తెలుగు దుర్యోధనులు,దుశ్శాసునుల పార్టీ టీడీపీ

జగనన్న ఇంటి పట్టా ఇచ్చారని చెప్పడమే నేరమా..?

వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్సీ శ్రీమతి వరుదు కళ్యాణి 

తాడేప‌ల్లి: గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గీతాంజలి అనే మహిళ తెలుగుదేశం,  జనసేన పార్టీల సోషల్‌మీడియా ట్రోల్స్‌కు మానసికంగా కుంగిపోయి.. బాధతో ఆత్మహత్యకు పాల్పడటం చాలా బాధాకరమ‌న్నారు వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి. టీడీపీ, జ‌న‌సేన సోష‌ల్ మీడియా చేష్ట‌ల‌ను  తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీల సోషల్‌మీడియా ట్రోల్స్‌తో ఒక నిండు ప్రాణాన్ని బలిగొనడం విన్న ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇద్దరు చిన్న ఆడబిడ్డలు చనిపోయిన తల్లి పార్థివ దేహం వద్ద నిల్చొని ఏడుస్తుంటే.. చూసిన ప్రతీ ఒక్కరూ చలించి పోయారన్నారు. ఒక తల్లిగా నేను ఈ సంఘటనను ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నానని,  ఇంతటి హృదయవిదారక ఘటనను ప్రతీ ఒక్కరూ ఖండిస్తున్నారన్నారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో శ్రీ‌మ‌తి వ‌రుదు క‌ళ్యాణి విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. 

ఈ సంద‌ర్భంగా వ‌రుదు క‌ళ్యాణి ఏం మాట్లాడారంటే.. 
తన సొంతింటి కల నెరవేర్చిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకుంటానని.. గౌరవ ముఖ్యమంత్రిగా వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మేలును కలకాలం గుర్తుపెట్టుకుని ఆయన్నే గెలిపించుకుంటామని చెప్పడమే ఆమె చేసిన తప్పా..? తెలుగుదేశం, జనసేన పార్టీల సోషల్‌మీడియా యాక్టివిస్ట్‌లు మరీ ఇంత ఘోరంగా ప్రవర్తిస్తారా..? దీన్ని ఆత్మహత్యగా కాకుండా.. తెలుగుదేశం, జనసేన పార్టీల సోషల్‌మీడియా చేసిన హత్యగానే భావించాలి. తల్లిని కోల్పోయిన ఆ ఇద్దరు ఆడబిడ్డల భవిష్యత్తేంటి..? మీ సోషల్‌మీడియా సైకోలు తల్లి మమకారాన్ని తిరిగి తెస్తాయా..? నిండు జీవితాన్ని బలిగొని.. ఇద్దరు ఆడబిడ్డల్ని అనాథల్ని చేయడం చాలా బాధాకరం.

వేధింపులే కారణమన్న గీతాంజలి భర్త
గీతాంజలి మరణంతో ఆమె  ఇద్దరు ఆడబిడ్డల భవిష్యత్తును కూడా సర్వనాశనం చేశారు. ఆమె భర్త కూడా ఈ ఘటనపై తల్లడిల్లిపోతున్నారు. తన భార్య ఎంతో సంతోషంగా ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నందునే తెలుగుదేశం,జనసేన పార్టీలు సోషల్‌మీడియా ట్రోల్స్‌తో ఆమె తీవ్రంగా మనోవ్యధకు గురైందని చెబుతున్నాడు. ఆరోజు రాత్రి, తెల్లవారుజామున కూడా ఆమె ఆ రెండు పార్టీల సోషల్‌మీడియా దుర్మార్గులు పెట్టిన కామెంట్లు చదివి బాధ పడిందని ఆమె భర్త చెబుతున్నారు. 

మహిళలంటే మీకు అంత చులకనా..?
 ఆ రెండు పార్టీల వారు అంత ఉన్మాదంగా వ్యవహరిస్తారా..? అదే మీ ఇళ్లల్లో మహిళల్ని ఇలానే వేరొకరు వేధిస్తే మీరు ఎలా భావిస్తారు.. అందరి ఆడవాళ్లను గౌరవించే సంస్కృతి, సంప్రదాయం మీ పార్టీలకు లేదా..?. మీ పార్టీ అధినేతలు చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్, బాలకృష్ణలు ఎటూ మహిళలంటే గౌరవం లేకుండా.. చాలా చులకన భావంతో మాట్లాడతారు. వారు మాట్లాడుతారు గనుక.. వారిని ఆదర్శంగా తీసుకుంటున్నారా..? మీలో మానవత్వం, సంస్కారం అనేదే ఉండదా అని మహిళా లోకం ప్రశ్నిస్తుంది. 

తెలుగు డర్టీ పార్టీ టీడీపీ
టీడీపీ అంటేనే తెలుగు దుర్యోధనులు, తెలుగు దుశ్శాసునుల పార్టీ అని చెప్పాలి. అంతకుమించి తెలుగు డర్టీ పార్టీ.. తెలుగు డెకాయిట్ల పార్టీ అని కూడా గుర్తుచేయాల్సి వస్తుంది. ఎందుకంటే, ఆ పార్టీకీ.. ఆ పార్టీ సోషల్‌ మీడియా సైకో సైన్యం ఒక తీవ్రమైన ఫ్రస్టేషన్‌లో బతుకుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుభిక్షమైన పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారని ఆ రెండు పార్టీలు జీర్ణించుకోలేక పోతున్నాయి. జగనన్న మళ్లీ ముఖ్యమంత్రిగా అవుతున్నారనే వాతావరణంతో ముఖ్యంగా చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేశ్‌లు కడుపు మంటతో రగిలిపోతున్నారు. వారి గ్యాస్‌ట్రబుల్‌కు వంతపాడుతూ పచ్చమీడియా రోత రాతలు రాస్తుంటే.. వారి సోషల్‌మీడియా సైకోలు మాత్రం సంతోషం వ్యక్తపరిచే ఆడబిడ్డల్ని టార్గెట్‌ చేసి వేధింపులకు గురిచేస్తున్నాయి. ఇది చాలా దురదృష్టకరం. ఇలాంటి సైకోల భరతం పట్టేందుకు పోలీసుయంత్రాంగం కొరఢా ఝళిపించాల్సిందేనని మేం డిమాండ్‌ చేస్తున్నాం. 

ఉగ్రవాద సంస్థలా పనిచేస్తున్న ఐ-టీడీపీ
ఐటీడీపీ అనేది నారా లోకేశ్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న సోషల్‌మీడియా సంస్థ. కానీ, దీన్ని ఐటీడీపీ అనేకంటే  ఉగ్రవాద సంస్థగా చెప్పాలి. ఒక ఉగ్రవాద సంస్థ చేసే పనుల కంటే మరీ ఘోరమైన దుర్మార్గాలకు ఈ ఐ-టీడీపీ వ్యక్తులు పాల్పడుతున్నారు. చంద్రబాబుకు మొదట్నుంచీ మహిళలంటే ఎప్పుడూ గౌరవం లేదు. పైగా, జగనన్న పాలనలో నవరత్నాల పథకాల అమలుపై నిరంతరం ఆయనకు ఏడుపులే ఉంటాయి. మళ్లీ, మా పార్టీ పథకాల్నే కాపీకొట్టి మరీ తన పార్టీ మేనిఫెస్టోలో పెట్టుకుంటాడు. 

సోషల్‌మీడియా సైకోలకు ఆదర్శం వారే
14 ఏళ్ల పాటు అధికారంలో ఉండి రాష్ట్రంలో ఏ ఒక్క మహిళకూ ఒక సెంటు స్థలం ఇంటి కోసం ఇవ్వకుండా.. చెప్పుకోదగ్గ పథకం ఏ ఒక్కటీ మహిళలకు అందివ్వని వ్యక్తి నారా చంద్రబాబునాయుడు. పైగా, మహిళల పట్ల ఆయనకున్న చులకన భావమే వారి పార్టీలో పనిచేసే సైకోలకు అలవాటైంది. చంద్రబాబేమో.. కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా..? అని ఆడపిల్ల పుట్టుకనే హేళన చేశాడు. మహిళా వాలంటీర్లు సంచులు మోస్తారు.. తలుపులు కొడతారంటూ ఆయన మహిళల పట్ల గౌరవం లేకుండా మాట్లాడాడు. లోకేశ్‌నేమో.. తన పార్టీలో ఎవరిపై ఎక్కువ కేసులుంటే వారికి అంత పదవులిస్తాననని నేరాలకు ఉసిగొల్పుతాడు. ఇలా రెచ్చగొట్టి ఉసిగొల్పితే మరి, మీ సైకో సైన్యం ఉన్మాదుల్లా కాకుండా ఏం చేస్తారు..? ఇద్దరు ఆడపిల్లలున్న తండ్రిగా బాలకృష్ణనైతే మరీ నీచంగా మాట్లాడుతాడు. ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి.. కడుపైనా చేయాలంటూ దారుణంగా మాట్లాడాడు. అలాంటి నాయకులున్న పార్టీలో సోషల్‌మీడియా సైకోలు ఇంతకన్నా ఏం చేస్తారు..? చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేశ్, బాలకృష్ణలు ఇకనైనా కళ్లు తెరిచి ఆడవారి పట్ల మీ చులకన భావాన్ని తగ్గించుకోవాలని .. లేదంటే, మహిళాలోకం టీడీపీ, జనసేన పార్టీలు పూర్తిగా కాలగర్భంలో శాశ్వత సమాధి చేస్తారని హెచ్చరిస్తున్నాను.  

గీతాంజలి చావుకు కారణమైన వారిని వైయ‌స్‌ జగన్ వదిలిపెట్టరు
గీతాంజలి మరణానికి సంబంధించి, ఇంతటి ఘోరానికి కారణమైన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు ఖచ్చితంగా ఉంటాయని భావిస్తున్నాను. ఎందుకంటే, మహిళా పక్షపాతి, మహిళా రక్షణ, సంక్షేమానికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే.. అది వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారే కాబట్టి.. దుర్మార్గులు, వెధవలకు శిక్ష పడి తీరుతుంది. సంస్కారం తెలియని ఉన్మాదులు చేసే తాటాకు చప్పుళ్లకు భయపడి మానసికంగా కుంగిపోయి ఏ ఒక్క మహిళా ఆవేశపూరిత నిర్ణయాలకు గురికాకూడదని వైఎస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం తరఫున మేం కోరుతున్నాము. మహిళలకు రక్షణగా జగనన్న నాయకత్వంలో పనిచేసే దిశ యాప్, దిశ పోలీస్‌స్టేషన్లు, జీరో ఎఫ్‌ఐఆర్‌ విధానం ఉంది. ప్రతీ సచివాలయ పరిధిలో మహిళా పోలీసులున్నారు. కేవలం ఒక్క ఫోన్‌కాల్‌తో పోలీసు యంత్రాంగమే మీ దగ్గరకొచ్చి మీకు రక్షణగా నిలబడుతోంది. ఏ ఒక్క మహిళ కూడా మీకు జగనన్న తోడుగా ఉన్నారన్న విషయం మరిచిపోవద్దు. 

Back to Top