ప్రజాకోర్టు అంటే వకీల్‌సాబ్‌ సినిమా సెట్టింగ్‌ కాదు పవన్‌..

175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టే దమ్ము, ధైర్యం నీకుందా..?

ప్రజాకోర్టు నిర్వహించేందుకు పవన్‌కు ఉన్న అర్హత ఏంటీ..?

మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్‌కు లేదు..

నాలుగు బెత్తం దెబ్బల స్టేట్‌మెంట్‌తోనే పవన్‌ ఆ అర్హత కోల్పోయాడు

వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం ఏనాడైనా కోర్టులను ధిక్కరించిందా..? నిందించిందా..?

మహిళా రక్షణ, సంక్షేమానికి సీఎం వైయస్‌ జగన్‌ పెద్దపీట వేశారు

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మహిళా పక్షపాతి

అబద్ధాన్ని పదే పదే చెప్పి దాన్ని నిజమని నమ్మించే బాబు ఫార్ములాను పవన్‌ ఫాలో అవుతున్నాడు

వైయస్‌ఆర్‌ సీపీ శాసనమండలి సభ్యురాలు వరుదు కల్యాణి

విశాఖపట్నం: మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారికి నాలుగు బెత్తం దెబ్బలు చాలని మాట్లాడిన పవన్‌ కల్యాణ్‌కు.. మహిళా రక్షణ గురించి, సాధికారత గురించి మాట్లాడే అర్హత లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాకోర్టు అంటే ఎన్నికలు.. ప్రజల తీర్పు తెలుసుకోవడానికి, వైయస్‌ఆర్‌ సీపీతో పోటీపడేందుకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలిపే దమ్మూ, ధైర్యం పవన్‌కు ఉందా..? అని ప్రశ్నించారు. మహిళా రక్షణ కోసం సీఎం వైయస్‌ జగన్‌ అసెంబ్లీలో దిశ బిల్లు ప్రవేశపెట్టి దాన్ని కేంద్రానికి పంపించారని, కేంద్రం వద్ద బిల్లు పెండింగ్‌లో ఉన్నప్పటికీ అందులోని అంశాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రజాకోర్టు అంటే రీమేక్‌ సినిమా వకీల్‌సాబ్‌లో సెట్టింగ్‌లు అనుకుంటున్నారా..? అని పవన్‌ కల్యాణ్‌ను ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ప్రశ్నించారు. విశాఖలో వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఏం మాట్లాడారంటే.. 

‘‘పవన్, చంద్రబాబు కలిసి చేస్తున్న దుర్మార్గాలు ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజాకోర్టు నిర్వహించేందుకు పవన్‌కు ఉన్న అర్హత ఏంటీ..? పవన్‌ డిగ్రీ చేశారా.. లాయరా.. న్యాయమూర్తా..? 

నా ప్రశ్నలకు పవన్‌ సమాధానం చెప్పగలరా..? 

  • మహిళలపై అఘాయిత్యాలు జరిగితే నాలుగు బెత్తం దెబ్బలు కొట్టి వదిలేయాలన్న  పవన్‌నే మొదట విచారించాలి. 
  • కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని ఆడపిల్ల పుట్టుకనే చంద్రబాబు అవహేళన చేశాడు. అతన్ని పవన్‌ విచారిస్తారా..? 
  • జనసేన కార్యకర్తల్లో కొందరు మహిళలపై అత్యాచారాలు చేశారు. మీ ప్రజాకోర్టులో వారిని విచారిస్తారా..? 
  • అరకు పార్లమెంటరీ నియోజకవర్గ జనసేన అధికార ప్రతినిధి లాడ్జిలో మహిళలను రెండ్రోజులు హింసించి చంపేశాడు. అతన్ని విచారిస్తారా..? 
  • ఆడపిల్ల కనిపిస్తే ముద్దయినా పెట్టాలి.. కడుపైనా చేయాలని బాలకృష్ణ అన్నాడు.. బాలకృష్ణను విచారించే దమ్ము పవన్‌కు ఉందా..? 
  • నారాయణ కాలేజీల్లో 22 మంది ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు.. నారాయణను ప్రజాకోర్టులో విచారించగలరా..? నారాయణ మరదలు పబ్లిక్‌గా అతని వల్ల పడిన ఇబ్బందులను బహిరంగంగా చెప్పింది. ఆవిడ పవన్‌ అభిమాని కదా మరి నారాయణను విచారించగలరా..? 
  • తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసిన లోకేష్‌ పీఏను విచారణ చేయగలడా..? 
  • రిషితేశ్వరి ఆత్మహత్యకు కారణమైన ప్రిన్సిపల్‌ను విచారించగలడా..? కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌లో మహిళల ఇబ్బందులకు కారణమైన టీడీపీ నాయకులను విచారించే దమ్మూ, ధైర్యం పవన్‌కు ఉందా..?

పవన్‌ ప్రజాకోర్టుకు సీఎం వైయస్‌ జగన్‌ కాదు.. సీఎం ఇంట్లో ఉండే కుక్క కూడా రాదు. సీఎం మీద 38 కేసులున్నాయి.. కోర్టులను నిందిస్తున్నారని పవన్‌ మాట్లాడుతున్నాడు. ఒక అబదాన్ని పదే పదే చెప్పి దాన్నే నిజం అని నమ్మించాలనే ∙చంద్రబాబు ఫార్ములాను పవన్‌ ఫాలో అవుతున్నాడు. వైయస్‌ఆర్‌ సీపీ గవర్నమెంట్‌ వచ్చాక ఎప్పుడైనా కోర్టులను ఏనాడైనా ధిక్కరించారా..? నిందించారా..? ఒక్క సంఘటనైనా పవన్‌ చెప్పగలడా..? ప్రజలకు మంచి చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ చూస్తుంటే ప్రతీసారి అడ్డంకులు సృష్టిస్తున్న చంద్రబాబు, పవన్‌ను నిందిస్తున్నారు తప్ప.. ఏనాడూ సీఎం కోర్టులను నిందించలేదు. 

మహానేత వైయస్‌ఆర్‌ చనిపోయిన తరువాత ఓదార్పు యాత్ర కోసం వైయస్‌ జగన్‌ బయల్దేరితే పవన్‌ పాట్నర్‌ చంద్రబాబు, సోనియా గాంధీ కలిసి పెట్టిన కేసులు అవి. చంద్రబాబులా కేసుల మీద స్టే తెచ్చుకోలేదు. కోర్టు కేసులను వైయస్‌ జగన్‌ నిజాయితీగా ఎదుర్కొంటున్నారు. వైయస్‌ జగన్‌ మోపిన కేసులన్నీ అక్రమమైనవని పార్లమెంట్‌ సాక్షిగా సుష్మా స్వరాజ్‌ చెప్పారు. వైయస్‌ఆర్‌ బతికున్నంత వరకు వైయస్‌ జగన్‌ మీద ఒక్క కేసు కూడా లేదు. అవి అక్రమ కేసులని పవన్‌కు అర్థం కావడం లేదా..? 

జీవితంలో ముఖ్యమంత్రి కాలేనని పవన్‌కు అర్థమైంది. సీఎం వైయస్‌ జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయం. అందుకే విపరీతమైన ఫ్రస్టేషన్‌తో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. సినిమా హీరో కాబట్టి అతన్ని చూసేందుకు వచ్చిన జనాన్ని తప్పుదోవ పట్టించడం ఎంతవరకు సమంజసం. చంద్రబాబు, పవన్‌ ఇద్దరూ కలిసి పదే పదే అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్‌ మాట్లాడుతున్నాడు. మహిళలపై అఘాయిత్యం జరిగితే నాలుగు బెత్తం దెబ్బలు కొడితే చాలు అన్న రోజే మహిళల గురించి మాట్లాడే అర్హత పవన్‌ కోల్పోయాడు. 

రాష్ట్రంలో వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చాక 15 వేల మంది మహిళా పోలీసులను ఏర్పాటు చేశారు. ఇలాంటి నియామకాలు చంద్రబాబు, పవన్‌ ఏర్పాటు చేసిన గవర్నమెంట్‌లో ఏనాడైనా జరిగిందా..? మహిళా రక్షణ కోసం దిశ పోలీస్‌ స్టేషన్ల, దిశ యాప్‌ తెచ్చారు.. ఇలాంటి ఆలోచన మీ గవర్నమెంట్‌లో ఏనాడైనా చేశారా..? మహిళలపై జరిగిన అరాచకాలపై విచారణ వేగంగా జరుగుతుంది. ఇలాంటివి ఎప్పుడైనా మీరు ఏర్పాటు చేసిన గవర్నమెంట్‌లో జరిగిందా..? 

మహిళా రక్షణకు సీఎం వైయస్‌ జగన్‌ పెద్దపీట వేశారు. అసెంబ్లీలో చట్టం చేసి మరీ 50 శాతానికి మించి పదవులు, నామినేటెడ్‌ పనులు ఇస్తున్నారు. సంక్షేమ పథకాలల్లో మెజార్టీ అక్కచెల్లెమ్మల పేరు మీదే అమలవుతున్నాయి. సీఎం వైయస్‌ జగన్‌ మహిళా పక్షపాతిగా నిలిచారు’’ అని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. 

Back to Top