పవన్‌కళ్యాణ్‌ జనసేనాని కాదు.. జన వినాశకుడు

ప్ర‌జ‌లంద‌రికీ ఈ విష‌యం ఎప్పుడో అర్థ‌మైంది

పవన్ ఓ ఫ్లవర్ స్టార్‌.. జనసేన కాదది.. చంద్రసేన

ప్రజాసేవలో జగనన్న వారియర్స్ వలంటీర్లు

పేదలకు జరుగుతున్న మేలు చూసి తట్టుకోలేని బాబు అండ్ కో విష‌ప్ర‌చారం 

చంద్ర‌బాబు చెప్పింది చేయడం, ఎల్లోమీడియా స్క్రిప్టు చదవడమే ప‌వ‌న్ ప‌ని

శాసనమండలి సభ్యులు శ్రీమతి వరుదు కళ్యాణి

విశాఖ‌ప‌ట్నం: సిద్ధాంతం, విలువ‌లు, అజెండా లేకుండా జ‌న‌సేన పార్టీ ఎలా ఉందో.. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ పర్యటన కూడా అంతేమాదిరిగా ఉందని, ఏ అజెండాతో పర్యటన‌లు చేస్తున్నాడో.. ఎవరిని దృష్టిలో ఉంచుకుని మాట్లాడుతున్నాడో ప్రజలకు అర్థంకావడం లేద‌ని వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి అన్నారు. చంద్రబాబు చెప్పింది చేయడం.. ఎల్లోమీడియా ఇచ్చిన స్క్రిప్టును చదవడం.. చెప్పిన అబద్దాలే మళ్లీ మళ్లీ చెప్పడం.. ముఖ్యమంత్రి  వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై లేనిపోని నింద‌లు వేయ‌డ‌మే పవన్‌కళ్యాణ్‌ అమలు చేస్తున్న ఫార్ములా అని వివ‌రించారు. పవన్‌కళ్యాణ్‌ జనసేనాని కాదు.. జన వినాశకుడు అని అందరికీ బోధపడిందన్నారు. విశాఖపట్నం వైయ‌స్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆమె ఇంకా ఏం మాట్లాడారంటే.. 

నిన్నటి పవన్‌కళ్యాణ్‌ పర్యటనతో విశాఖపట్నం ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది. ఆయన మాటలను బట్టి ఆయన్ను, జనసేనను ఇకనుంచి ఎలా అర్ధం చేసుకోవాల్నో ప్రజలకు స్పష్టతవచ్చింది. జనసేన పార్టీ.. చంద్రసేన అనేది అర్ధమైంది. పవన్‌కళ్యాణ్‌ జనసేనాని కాదు.. జన వినాశకుడు అని అందరికీ బోధపడింది. ఆయనెక్కి మాట్లాడే వాహనం వారాహీ కాదు.. నారాహీ అని తేటతెల్లమైంది. ఇక, సినిమాహీరోగా అతను పవర్‌స్టార్‌ కావచ్చేమో గానీ ..  రాజకీయాల్లో ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టే ఫ్లవర్‌ స్టార్‌ ఆయన అని తెలిసిపోయింది. అంతేకాకుండా, విశాఖపట్నమన్నా.. విశాఖ ప్రజలన్నా పవన్‌కళ్యాణ్‌కు ఎంత ద్వేషముందనేది నిన్నటి పర్యటనతో అందరికీ స్పష్టం గా అర్థమైంది. 

వలంటీర్లపై తప్పుడుమాటలు
పెందుర్తిలో నిన్న ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు వపన్‌కళ్యాణ్‌ వెళ్లాడు. వాస్తవాలు తెలియకుండా అక్కడ ఏవేవో మాట్లాడాడు. వెంకటేష్‌ అనే వ్యక్తి ప్రవర్తనపై ప్రభుత్వం అంతకుముందే గ్రహించి.. వలంటీర్‌ పోస్టు నుంచి తొలగించింది. ఆ తర్వాత వరలక్ష్మి అనే ఆవిడ కొడుకు దగ్గర టిఫిన్‌ సెంటర్‌లో పనికి కుదిరాడు. వారి కుటుంబ సాన్నిహిత్యంతో బంగారం కోసం వరలక్ష్మి అనే వృద్ధురాలిని హత్యగావించాడు. మరి, ఈ ఉదంతానికి వలంటీర్లకు సంబంధమేంటి..? హతురాలి కొడుకు కూడా మా వాలంటీర్‌ వెంకటేష్‌ కాదు.. మరో మహిళ అని ఆమె బాగా పనిచేస్తుందని చెప్పాడు. అయినా.. ఈ పవన్‌కళ్యాణ్‌ మాత్రం వాస్తవాల్ని తెలుసుకోకుండా ఒక పార్టీ అధ్యక్షుడిగా అక్కడికి వెళ్లి వలంటీర్ల గురించి హంతకులు అని మాట్లాడుతాడు. ఆయన వ్యవహారశైలికి .. మాట్లాడే మాటలకు ఏమైనా అర్ధం ఉందా..? అని అడుగుతున్నాను. వలంటీర్లపై తప్పుడు మాటలు మాట్లాడటానికి ఆయనకు నోరెలా వస్తుంది..? దాదాపు వాలంటీర్‌ వ్యవస్థలో 70శాతం మహిళలు పనిచేస్తుంటే.. ఆయన మాత్రం  మహిళలంటే గౌరవం లేకుండా అవమానపరచడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నాను. 

జనసేన నేతల పైశాచికత్వాలపై స్పందించవా..?
ఒక రాజకీయ పార్టీగా పరామర్శలకు వెళ్లడంలో తప్పేమీ లేదు. కానీ, అక్కడికి వెళ్లేటప్పుడే వాస్తవాల్ని తెలుసుకుని దేనిమీద మాట్లాడాలో సమాచారం తీసుకుని నాయకుడు బాధ్యతగా మెలగాలి. మరి, నిన్న పనిలోపనిగా ఎస్‌.కోటలో జరిగిన ఆరిపాక ఈశ్వరమ్మ హత్యపై కూడా స్పందించి ఉంటే బాగుండేది. ఎందుకంటే, అది స్వయాన తనపార్టీకి చెందిన అధికారప్రతినిధి, జనసేన నేత మాదాల శ్రీరాములు చేసిన హత్య అది. నమ్మకంగా ఎస్‌.కోటలోని ఓ లాడ్జీకి తీసుకెళ్లి ఆరిపాక ఈశ్వరమ్మ అనే మహిళను హత్యచేశాడు. మరి, ఆ బాధిత ఈశ్వరమ్మ  కుటుంబాన్ని కూడా పవన్‌కళ్యాణ్‌ పరామర్శించి మా జనసేన పార్టీ నాయకులంతా ఇంతేనమ్మా.. మహిళల్ని వలలో దింపి నమ్మించి మోసం చేస్తారు. అడ్డు తొలగించుకోవడానికి హత్యలు చేస్తారంటూ వాళ్లకు ఈ పవన్‌కళ్యాణ్‌ చెప్పొచ్చు కదా..?  హిందూపురంలో మీ జనసేన పార్టీ ఇంచార్జి రెండ్రోజుల కిందట్నే ఒక వ్యక్తిపై దాడిచేసి 16 తులాలు బంగారం దోచుకెళ్లాడు కదా..? మరి, ఆ వ్యక్తి తాలూకూ కుటుంబ సభ్యుల్ని కలిసి పరామర్శించి మాపార్టీవోళ్లంతా దొంగలని ఎందుకు చెప్పలేదు..? అని వపన్‌కళ్యాణ్‌ను నిలదీస్తున్నాను.  

నారావారి నరకాసుర పాలనపై నోరుమెదపవేం..?
2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో జరిగిన నారా వారి నరకాసుర పాలనపై ఈ పవన్‌కళ్యాణ్‌ ఎందుకు నోరుమెదపలేదు. ప్రశ్నిస్తానంటూ.. చంద్రబాబును గెలిపించి ఆయన అధికారంలోకి రాగానే ఎందుకు తోక జాడించాడు. ఏం.. అప్పట్లో మహిళలపై జరిగినవి నేరాలు, ఘోరాలుగా కనిపించలేదా..? ఇదే పెందుర్తిలో బాబు హయాంలో టీడీపీ ఎమ్మెల్యే బండారు వర్గం ఒక దళిత మహిళను వివస్త్రను చేసి లాక్కుని వెళ్లారు కదా..? మరి, ఆ బాధితురాలి కుటుంబాన్ని కూడా పవన్‌కళ్యాణ్‌ పరామర్శించొచ్చు కదా..? బాబు అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు బీసీ విద్యార్థిని రిషితేశ్వరి అనుమానాస్పదంగా మరణిస్తే .. ఆమె ఆత్మహత్యకు కారణమైన ప్రిన్సిపాల్‌ను బాబు సపోర్టు చేసినప్పుడు ఈ వపన్‌కళ్యాణ్‌ ఎందుకు ఖండించలేదు..? అప్పటి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఒక తహశీల్దార్‌ వనజాక్షిని ఈడ్చి కొడితే వాళ్ల కుటుంబాలను మీరెందుకు పరామర్శించలేదు..? అని అడుగుతున్నాను. 

ఆడపిల్ల పుట్టుకనే అవమానించిన వ్యక్తితో నీకు పొత్తా..?
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మహిళలపై జరిగిన ఘోరాలు అన్నీఇన్నీ కావు. కనీసం, ఆయన బాధితుల్ని పరామర్శించకపోగా తనను కలవాలని, తమ గోడు చెప్పుకోవాలని ప్రయత్నించిన వారిని కూడా తీవ్రంగా అవమానించిన వ్యక్తి. ఒక సందర్భంలో కోడలు మగపిల్లాడ్ని కంటానంటే..అత్త వద్దంటుందా అంటూ ఆడపిల్ల పుట్టుకనే అవమానించిన దుర్మార్గుడు చంద్రబాబు. మరి, అలాంటి నీచుడితో పొత్తుపెట్టుకుని మహిళలు, గౌరవం అంటూ చిలుకపలుకులు పలకడానికి పవన్‌కళ్యాణ్‌కు సిగ్గుందా.. లేదా..? అని అడుగుతున్నాను.

మహిళల గౌరవంపై మాట్లాడే హక్కే నీకులేదు
మహిళల్ని దఫాలు దఫాలుగా కించపరిచి అవమానించిన చంద్రబాబును వెనుకేసుకొచ్చే ఈ పవన్‌కళ్యాణకు మహిళల గురించి మాట్లాడే హక్కే లేదని గుర్తుచేస్తున్నాను. దిశలాంటి సంఘటనలు ఆనాడు పలుచోట్ల జరిగినప్పుడు ఇదే వ్యక్తి ఏమన్నాడు..? మహిళలపై ఏమాత్రం కనికరం చూపకుండా మాట్లాడాడు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని నాలుగుబెత్తం దెబ్బలు కొట్టి వదిలేయడమే తప్ప ఏం చేయలేమని మీరు చెప్పలేదా..? అని అడుగుతున్నాను. మీలాంటి వారు మహిళలపై మొసలికన్నీరు కారుస్తుంటే ప్రజలు నమ్మేపరిస్థితుల్లో లేరని స్పష్టంచేస్తున్నాను. నారాయణ కాలేజీలో 22 మంది అమ్మాయిలు చనిపోతే చంద్రబాబు ఏం చేశాడు..? నారాయణకు సపోర్టుగా నిలిచాడు. ఆరోజు మరి ఆ చంద్రబాబునో.. నారాయణనో ఈ పవన్‌కళ్యాణ్‌ ఎందుకు ప్రశ్నించలేదు..? అలాగే, ఆ 22 మంది అమ్మాయిల కుటుంబాల్ని ఎందుకు పరామర్శ చేయలేదు..? నారాయణ మరదలు మీ అభిమానినంటూ చెప్పుకుని తనకెదురైన వేధింపుల గురించి వాపోయినప్పుడు ఈ పవన్‌కళ్యాణ్‌ ఎక్కడ నిద్రపోతున్నాడు..? ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించి నారాయణ వేధింపులపై గడ్డిపెట్టొచ్చు కదా..? ఆ పని ఎందుకు చేయలేదు.?అలాగే విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యేలు నడిపిన కాల్‌మనీ, సెక్స్‌రాకెట్లలో వందలమంది మహిళలు బలయ్యారు. పవన్‌కళ్యాణ్‌.. వాళ్లందరి కుటుంబాల్ని పరామర్శించవు.. వారిని ఆదుకోవు. ఎందుకంటే, నీకు నీ యజమాని చంద్రబాబుతో పొత్తులు, ఒప్పందాలు తప్ప ప్రజలేమైపోయినా ఫర్వాలేదు కనుక. అంటే, ప్రభుత్వాలు మారేకొద్దీ మీ మాటల్లో చేతల్లో ప్రవర్తనల్లో మార్పొస్తుందా పవన్‌కళ్యాణ్‌..? 

ప్రజల దృష్టిలో ఆ ముగ్గురూ జోకర్లు
వ్యవస్థ అన్నాక కొన్నిచోట్ల లోపాలుంటాయి. వాటిని సరిదిద్దుకుని వ్యవస్థను గౌరవించుకోవాలి గానీ పూర్తిగా తప్పుబడితే ఎలా..? ఇప్పుడు వాలంటీర్‌ వ్యవస్థపై చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేశ్‌లు ఇలాగే కుట్రగట్టుకుని మరీ మాట్లాడుతున్నారు. లేనిపోని అభాండాలేస్తూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. నోరుతెరిస్తే చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్‌లు అబద్ధాలతోనే ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు కూడా ఈ ముగ్గురిని జోకర్‌ల కిందనే చూస్తూ.. వీరి మాటల్ని నమ్మడం లేదు. 

ఎన్సీఆర్‌బీ నివేదిక ప్రకారం..
గౌరవ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన మొదలయ్యాక ఈ రాష్ట్రంలో ఎక్కడా శాంతిభద్రతలు గాడితప్పలేదు. పవన్‌కళ్యాణ్, చంద్రబాబు పర్యటనల్లో కావాలని ప్రజల్లో ఉనికిచాటుకునేందుకు కుట్ర చేసిన ఘర్షణలు తప్ప అంతా ప్రశాంతంగానే ఉంది. మహిళల అక్రమరవాణాపై పవన్‌కళ్యాణ్‌ ఆరోపణల్లో ఎక్కడా వాస్తవాల్లేవు. ఆయన జ్ఞానం ఉండే మాట్లాడుతున్నాడా..? కేంద్ర హోం మంత్రే లోక్‌సభలో సమాధానమిచ్చిన ఎన్సీఆర్‌బీ నివేదిక ప్రకారం  దేశవ్యాప్తంగా మిస్సింగ్‌ కేసులు 4,65,171 ఉంటే, అందులో ఆంధ్రప్రదేశ్‌లో కేసుల సంఖ్య 24,557 గా ఉంది. వీరిలో కూడా 1158 మంది మినహా మిగతా అందరూ ట్రేస్ అయ్యారు.అంటే, మహిళల మిస్సింగ్‌ ఒక్క ఆంధ్రాలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నాయన్నది తెలుసుకోవాలి. మరి, 4 లక్షల మంది మహిళలు దేశంలో అదృశ్యమయ్యారని.. ప్రధాని మోదీ పాలనలో మహిళలకు రక్షణే లేదని ఈ పవన్‌కళ్యాణ్‌ అనే దమ్ము, ధైర్యం ఉందా..? అని ప్రశ్నిస్తున్నాను. మరి, వైయ‌స్‌ జగన్‌ పాలనపై నోరేసుకుని పడిపోవడం తప్ప నిజాలెందుకు మాట్లాడరు. మహిళల మిస్సింగ్‌లలో దేశవ్యాప్తంగా మనరాష్ట్రం 13వ స్థానంలో ఉంటే.. వాళ్లను వెదికి తెచ్చి సురక్షితంగా ఇంటికి చేర్చే రాష్ట్రాల్లో ఆంధ్ర 2వ స్థానంలో ఉంది. ఇప్పటికీ మిస్సింగ్‌ మహిళల్లో ఇంకా కేవలం 1158 మంది ఆచూకీ మాత్రమే తెలియాల్సి ఉంది. దీన్నిబట్టి వైయ‌స్‌ జగన్‌ పాలనలో మహిళలెంతగా రక్షణ పొందుతున్నారో తెలుస్తుంది. 

వలంటీర్లంటే.. జగనన్న వారియర్స్
ఒక విధానం లేకుండా.. రాజకీయాల పట్ల ఏమాత్రం అవగాహన లేని పవన్‌కళ్యాణ్‌కు వలంటీర్‌ వ్యవస్థంటే ఎందుకు వణుకు పుడుతుంది. చంద్రబాబు హయాంలో చేయలేని పనులన్నీ సీఎం వైయ‌స్‌ జగన్‌ పాలనలో చేసి చూపడానికి కీలకమైన వ్యవస్థగా ఉన్న వలంటీర్లంటే వారి వెన్నులో వణుకు సాధారణమేనని చెప్పాలి. రాష్ట్రంలో ఏ సర్వే సంస్థలైనా ఇంటింటికి తిరిగి వలంటీర్ల పనితీరు గురించి ఆరాతీస్తే .. వారెంత మంచిగా పనిచేస్తున్నారో తెలుస్తోంది. ఇతను సినిమా హీరో కదా..? ఆయన సినిమాలకు టైటిల్స్‌ అడ్డదిడ్డంగా పెట్టుకోరు కదా..? మరి, ఆయన వలంటీర్లను దండుపాళ్యం బ్యాచ్‌తో ఎలా పోలుస్తారు..? నిజానికి బాబు, లోకేశ్, పవన్, రామోజీ, రాధాకృష్ణలు దుష్టచతుష్టయాలతో పాటు ఈ దండుపాళ్యం బ్యాచ్‌ అని సార్థకనామధేయం తెచ్చుకున్నారు. మా వాలంటీర్లు మాత్రం ప్రజాదరణ గల్గిన నాయకులు వైయ‌స్‌ జగన్‌ పాలనకు మూలస్థంభంగా నిలిచిన దమ్మున్న వారియర్‌ బ్యాచ్‌ గా ఉన్నారు. 
 
మహిళా పక్షపాతి సీఎం వైయ‌స్‌ జగన్‌
ఇచ్చిన మాటకు కట్టుబడటమనేది రాజకీయాల్లో ఒక్క వైయ‌స్‌ జగన్‌లోనే చూస్తాం. మహాకవి శ్రీశ్రీ అన్నట్లు ఈరోజు మహిళలు ఆకాశంలో సగం.. అవనిలో సగంలా అన్నిరంగాల్లోనూ ముందంజలోనే ఉన్నారు. సీఎం వైయ‌స్ జగన్‌  మహిళలకు ఒక అన్నగా, తమ్ముడిగా కొండంత అండనిచ్చి ధైర్యమిచ్చిన ముఖ్యమంత్రి అని రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఆదరణ పొందుతున్నారు. డీబీటీ, నాన్‌డీబీటీ ద్వారా మహిళా సోదరీమణులకు సుమారు రూ.3.5 లక్షల కోట్ల లబ్ధిని నేరుగా అందించారు. అదేవిధంగా పనులు, పదవుల్లోనూ 55 శాతం మహిళా రిజర్వేషన్‌ను అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌ అని మేం గర్వంగా చెప్పుకుంటున్నాం.

ఒక్క ఆసరా పథకం ద్వారానే రూ.24వేల కోట్లు చెల్లించి మహిళా పక్షపాతిగా సీఎం వైయ‌స్‌ జగన్‌ నిలిచారు. ఈరకమైన ప్రజాదరణను చూసి తట్టుకోలేకనే ఈ చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్‌ యాత్రల పేరిట విమర్శలకు పాల్పడుతున్నారు. మరోవైపు పచ్చమీడియాలో విషపురాతలతో ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మహిళల్లో ఈ ప్రభుత్వానికి ఉన్న మంచిపేరును చెరిపేయలేరని గుర్తుచేస్తున్నాను. 

బాబు అండ్‌ కో అక్రమకట్టడాల్ని చూడరా బాబూ 
రుషికొండ వెళ్లి పవన్ కళ్యాణ్  జంపింగ్‌లు చేశాడు. మరి, అదే వైజాగ్‌లో టీడీపీ నేతలు ప్రభుత్వ స్థలాల్ని కబ్జా చే స్తే.. వాటిని కూడా సందర్శించి ఉంటే బాగుండేది. అమరావతిలో వేల ఎకరాల్ని రియల్‌ ఎస్టేట్‌కు వాడుకుని పచ్చదన్నాన్ని నాశనం చేసిన చంద్రబాబు ఈయన దృష్టిలో ఒక హీరో. అదేవిధంగా రామోజీరావు వందల ఎకరాల్లో కొండలపై నిర్మాణాలు చేసి ఫిల్మ్‌సిటీ కడితే ఇతనికి అదొక ఇంద్రలోకంగా కనిపిస్తుంది. ఇదే వైజాగ్‌లో మరోవైపు రామానాయుడు స్డూడియో భవనాలు కట్టుకుంటే అవికూడా బాబు  ఖాతా స్వర్గభవంతులుగా కనిపిస్తాయి. ఇవన్నీ అద్భుతాలుగా కనిపించిన పవన్‌కళ్యాణ్‌కు సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వస్థలాల్లో ప్రభుత్వ కట్టడాలు కడితే మాత్రం విధ్వంసంగా కనిపిస్తున్నాయి. మీరు చెప్పే పిచ్చి మాటలు, ప్రేలాపనల్ని ప్రజలు నమ్ముతున్నారనే భ్రమల్లో ఉన్నారేమో.. అది వాస్తవం కాదు. పవన్‌కళ్యాణ్, ఆయన పార్టీ పట్ల ఉత్తరాంధ్ర ప్రజలు ఒక స్పష్టతకొచ్చారు. ఇలాగే, ఆయన పిచ్చిపిచ్చిగా వాగితే ప్రజలు తరిమితరిమి బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నాను. 

Back to Top