శాసనమండలి: మహిళా ముఖ్యమంత్రులు ఉన్న రాష్టాల్లోనూ జరగనంత మహిళా సాధికారత ఆంధ్రరాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో జరుగుతోందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీసుకున్న చర్యలు గతంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోలేదని చెప్పారు. శాసనమండలిలో మహిళా సాధికారతపై చర్చలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో ఉండటం కోసం సీఎం వైయస్ జగన్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. మహిళలకు 50 శాతానికి మించి నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లోనూ అవకాశం కల్పించారని చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల్లో మెజార్టీ పథకాలు మహిళ పేరిటే అమలవుతున్నాయని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి చెప్పారు. 86 శాతం మహిళలే లబ్ధిదారులుగా ఉన్నారన్నారు. మహిళల రక్షణ కోసం దిశ చట్టం, దిశ యాప్‌ను తీసుకువచ్చారని గుర్తుచేశారు. మహిళలపై అఘాయిత్యాలు జరిగితే కఠిన చర్యలు తీసుకోవడానికి దిశ చట్టం తీసుకువస్తే.. మహిళలపై అరాచకాలు జరగకుండా దిశ యాప్‌ను తీసుకువచ్చారన్నారు. మేయర్లు, డిప్యూటీ మేయర్లు, జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు ఇలాంటి పదవులకు గానూ రాజ్యాంగం కల్పించిన అవకాశం కంటే ఎక్కువగా సీఎం వైయస్ జగన్ కల్పించారని చెప్పారు. మహిళలు గతంలో ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడేవారని, ఈరోజు వైయస్ జగన్ ప్రభుత్వంలో మహిళలు వారి కళ్ల మీద వారు నిలబడుతున్నారన్నారు. ఇళ్ల పట్టాలు ఇచ్చి, సొంతింటి కలను సహకారం చేస్తున్న సీఎం వైయస్ జగన్‌కు మహిళలంతా కృతజ్ఞతలు తెలుపుతున్నారని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి చెప్పారు.