ఇది ప్ర‌జ‌ల‌కు ద‌క్కిన గౌర‌వంగా భావించాలి

మూడ్ ఆఫ్‌ది నేష‌న్ స‌ర్వే ఫ‌లితాలు రాష్ట్రానికి గ‌ర్వ‌కార‌ణం

వైయ‌స్ఆర్ సీపీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు

విజ‌య‌వాడ‌: ఇండియా టుడే మూడ్‌ ఆఫ్‌ది నేషన్‌ నిర్వహించిన సర్వేలో దేశంలోనే ప్ర‌తిభ గ‌ల ముఖ్య‌మంత్రుల్లో వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మూడో స్థానంలో నిలవ‌డం రాష్ట్రానికి గ‌ర్వ‌కార‌ణం అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు అన్నారు. దేశ వ్యాప్తంగా అత్యంత ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన ముఖ్య‌మంత్రుల్లో వైయ‌స్ జ‌గ‌న్ మూడో స్థానంలో నిలిచార‌న్నారు. ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌తి చిన్న విష‌యాన్ని అడ్డుకోవాల‌ని చూసే వారికి ఈ స‌ర్వేలో వెల్ల‌డైన‌ ఫ‌లితాలు క‌నువిప్పు అన్నారు. మొద‌టిసారి సీఎం అయినా కూడా పెద్ద పెద్ద నేత‌ల కంటే మెరుగైన పాల‌న ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ అందిస్తున్నారన్నారు. ఎంతో అనుభ‌వం ఉన్న సీనియ‌ర్ ముఖ్య‌మంత్రుల్లో వైయ‌స్ జ‌గ‌న్ ముందు వ‌రుస‌లో ఉన్నారన్నారు. 15 నెల‌ల్లోనే ప్ర‌జ‌ల ప‌ట్ల ఆయ‌న‌కు ఉన్న నిబ‌ద్ధ‌త చూపించారని తెలిపారు. ఇది ప్ర‌జ‌ల‌కు ద‌క్కిన గౌర‌వంగా భావించాలని ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు చెప్పారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top