ఆఖరి ఓటు లెక్కింపు వరకు అప్రమత్తంగా ఉండాలి

డిస్టబెన్స్‌ ఉంటే రీ కౌంటింగ్‌ అడగవచ్చు

ప్రతి ఒక్క ఓటు విలువైనది జాగ్రత్తగా గమనించాలి

కౌంటింగ్‌పై వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థులు, ఏజెంట్లకు శిక్షణ శిబిరం

దిశానిర్దేశం చేసిన పార్టీ సీనియర్‌ నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి

విజయవాడ: ఫస్ట్‌ ఓటు కౌంటింగ్‌ నుంచి లాస్టు ఓటు లెక్కింపు వరకు ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సూచించారు. విజయవాడ ఏ1 కన్వెన్షన్‌లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు, చీఫ్‌ కౌంటింగ్‌ ఏజెంట్లకు కౌంటింగ్‌పై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వైయస్‌ఆర్‌ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ సీఎస్‌ అజయ్‌ కల్లాం, రిటైర్డ్‌ ఐఏఎస్‌ శామ్యూల్‌ తదితరులు పాల్గొన్నారు. శిక్షణలో ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కౌంటింగ్‌ ఏజెంట్ల విధులు, బాధ్యతలపై ట్రైనింగ్‌ ఇవ్వాలనే ఉద్దేశంతో 175 మంది అసెంబ్లీ అభ్యర్థులు, 25 మంది ఎంపీ అభ్యర్థులను, వారితో పాటు చీఫ్‌ ఎలక్షన్‌ ఏజెంట్లను పిలిపించామన్నారు. తిరిగి నియోజకవర్గాలకు వెళ్లి కౌంటింగ్‌ ఏజెంట్లను ఎంతమందిని నియమించుకుంటారో.. వారికి మళ్లీ ఇచ్చి కౌంటింగ్‌ గదిలోకి పంపే ఏర్పాటు చేసుకోవాలని సూచించామన్నారు. అసెంబ్లీ, ఎంపీ అభ్యర్థులు, చీఫ్‌ ఎలక్షన్‌ ఏజెంట్లను మొత్తం 400 మందికి శిక్షణ ఇచ్చామన్నారు. 

కౌంటింగ్‌ ఏజెంట్ల అర్హత గురించి వివరించామని, క్రిమినల్‌ కేసులు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండకూడదనే ఎలక్షన్‌ కమిషన్‌ నిబంధలన్నీ వివరించామన్నారు. సహజంగా ఒక్కో గదిలో 14 టేబుల్స్‌ వేస్తారు. సగటున 14 మంది ఏజెంట్లు, మెయిన్‌ టేబుల్‌ మీద పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల కౌంటింగ్‌ వద్ద ఒకరు, కొందరు రిజక్ట్‌ అవుతారేమోనని రిజర్వ్‌గా ముగ్గురు లేదా నలుగురిని పెట్టుకోవాలని సూచించామన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థికి 18 మంది ఏజెంట్లు, ఎంపీకి 18 మందిని పెట్టుకునే అవకాశం ఉందన్నారు. కౌంటింగ్‌ హాల్‌లో డిస్టబెన్స్‌ ఉంటే రీకౌంటింగ్‌ అగడవచ్చ సూచించామన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఎన్ని వచ్చాయని క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని చెప్పాం. కౌంటింగ్‌ హాల్‌లోకి ఎంటర్‌ అయిన తరువాత ఫోన్లు వాడకూడదు. ఫస్ట్‌ ఓటు కౌంటింగ్‌ నుంచి లాస్టు ఓటు కౌంటింగ్‌ వరకు అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశామన్నారు. 

ప్రతి ఓటు విలువైంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అభ్యర్థులకు, కౌంటింగ్‌ ఏజెంట్లకు సూచించామని ఉమ్మారెడ్డి చెప్పారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సూచనల మేరకు శిక్షణా కార్యక్రమం నిర్వహించామన్నారు. ఎన్నికల కమిషన్‌ ప్రింట్‌ చేసి ఇచ్చిన మ్యాన్యుల్‌ కూడా అందరికీ ఒక కాపీ అందజేశామన్నారు. 

 

Back to Top