మాది సంక్షేమ‌ ప్రభుత్వం

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ  రవీంద్రబాబు

అమ‌రావ‌తి:  మాది సంక్షేమ ప్ర‌భుత్వ‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ ర‌వీంద్ర‌బాబు పేర్కొన్నారు. ప్రతీ సంక్షేమ‌ పథకం ప్రజల మేలు కోసమే అమలు చేశామ‌న్నారు. మా ప్రభుత్వానికి పబ్లిసిటీ ముఖ్యం కాదు.. ప్రజలకి మేలు జరగడం‌ ముఖ్యమ‌ని చెప్పారు. రాష్ట్రానికి కోవిడ్ సమయంలో రావాల్సిన ఆదాయం రాలేదన్నారు. రెండేళ్ల కోవిడ్ సమయంలో రెండు లక్షల కోట్ల రూపాయిల ఆదాయం తగ్గిపోయిందని తెలిపారు. గడిచిన నాలుగన్నరేళ్ల పాలనలో 4.60 లక్షల కోట్లు ప్రజలకి నేరుగా అందించామ‌ని చెప్పారు. అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజల ఖాతాలలోకి నిధులు జమ చేశామ‌ని వివ‌రించారు. మా ప్రభుత్వం వైద్యం, విద్య, వ్యవసాయ రంగాలకి అధిక ప్రాధాన్యతనిచ్చిందని చెప్పారు. ప్రతీ‌జిల్లాకి ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. మన రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు లేకే ఉక్రెయిన్ లాంటి సుదూర దేశాలకి గ‌తంలో వెళ్లాల్సిన పరిస్ధితి ఉండేద‌న్నారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్న్పటికీ రాష్ట్రంలో సంక్షేమ‌ పథకాలు ఎక్కడా ఆగలేద‌ని ర‌వీంద్రబాబు స్ప‌ష్టం చేశారు.

Back to Top