బావ జూమ్‌ బాబు.. బాలయ్య అబ్సకండ్‌ బాబు

సినిమాలు తప్ప హిందూపురం ప్రజల కష్టాలు బాలయ్యకు పట్టవు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌

అనంతపురం: 'నీ సినిమాలు, నీ కుమారుడితో తీయబోయే సినిమాలే తప్ప.. హిందూపురం ప్రజల సమస్యలు పట్టవా..?' అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ బాలకృష్ణను ప్రశ్నించారు. లాక్‌డౌన్‌లో ఒక్కసారైనా బాలయ్య హిందూపురం వచ్చారా..? అని నిలదీశారు. ఎమ్మెల్సీ ఇక్బాల్‌ మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో బాలకృష్ణ నియోజకవర్గానికి వచ్చిందేలేదన్నారు. ప్రజలంతా కష్టాలు పడుతుంటే బాలకృష్ణ ఏనాడూ హిందూపురం ప్రజలను పట్టించుకోలేదని మండిపడ్డారు. కనీసం చుట్టపుచూపుగా వచ్చైనా ఎవరినీ పలకరించలేదన్నారు. సినిమాలు, షూటింగ్‌లతో బాలకృష్ణ బిజీ అయ్యారే తప్ప ప్రజల బాగోగుల గురించి ఏనాడూ ఆలోచించలేదన్నారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top