దొంగ ఓట్లు వేయించే కల్చర్‌ టీడీపీదే..

వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి

చంద్రబాబుకు కుప్పంలో ఓటు లేదు.. ఎందుకు వెళ్తున్నారు..?

ప్రశాంతంగా ఉన్న ఏరియాలో అలజడి సృష్టించాలని టీడీపీ కుట్ర

టీడీపీ అరాచకాలపై ఆధారాలతో సహా ఎస్‌ఈసీకి వైయస్‌ఆర్‌ సీపీ ఫిర్యాదు

విజయవాడ: మున్సిపల్, జెడ్పీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేసింది. టీడీపీ దౌర్జన్యాలపై  రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్నికి వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నారాయణమూర్తి ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో ఓటర్లను భయపెడుతూ.. ప్రలోభాలకు పాల్పడుతున్న తెలుగుదేశం పార్టీపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్, జెడ్పీ ఉప ఎన్నికల్లో టీడీపీ కుట్రలకు తెరలేపిందని మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ విలువలను దిగజారుస్తున్నారని, కుప్పంలో టీడీపీ నేతలు అమర్నాథ్‌రెడ్డి, పులివర్తి నాని దౌర్జన్యాలు చేస్తున్నారన్నారు. 

కుప్పం పర్యటనలో లోకేష్‌ న్యాయస్థానాల విలువలను దిగజార్చేలా ప్రవర్తించారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు ఓటర్లను భయపెడుతూ, ప్రలోభాలకు గురిచేస్తున్నారన్నారు. కుప్పం వెళ్లాలని చంద్రబాబు స్పెషల్‌ ఫ్లైట్‌ సిద్ధం చేసుకున్నారని, బాబుకు కుప్పంలో ఓటు లేదు.. ఎందుకు వెళ్తున్నారు..? అని ప్రశ్నించారు. కుప్పంలో చంద్రబాబు ఓటర్‌ కాదు, నారావారిపల్లిలో కూడా బాబుకు ఓటు లేదన్నారు. దొంగ ఓట్లు వేయించే కల్చర్‌ టీడీపీదే. ప్రశాంతంగా ఉన్న ఏరియాలో అలజడి సృష్టించాలని టీడీపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. టీడీపీ అరాచకాలపై ఆధారాలతో సహా ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేశామని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు. 
 

Back to Top