నమ్మకం అంటే వైయ‌స్ జగన్.. వైయ‌స్ జగన్ అంటే నమ్మకం

 వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి  

ఇచ్చిన మాటకు కట్టుబడి అగ్రిగోల్డ్ బాధితులను వైయ‌స్ జగన్ ఆదుకుంటున్నారు 

 20 వేల లోపు అగ్రిగోల్డ్ బాధితుల బ్యాంకు ఖాతాల్లో 24న డబ్బులు జమ 

 అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది 

 అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం యోచన

తాడేప‌ల్లి: ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటున్నారని, రూ.20వేల లోపు డిజిపాట్‌లు ఉన్న బాధితులందరికీ ఈ నెల 24న ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తుందని వైయస్ఆర్‌ సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం యోచన చేస్తోందని, ఇందులో ఎలాంటి అనుమానాలు, అపోహలు వద్దని  స్పష్టం చేశారు. ఒక మాట ఇస్తే.. ఎంత కష్టమైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం వైయ‌స్ జగన్ గారి స్వభావం అని, నమ్మకం అంటే వైయ‌స్ జగన్ గారు.. జగన్ గారు అంటే నమ్మకం అని అప్పిరెడ్డి అభివ‌ర్ణించారు.  

తాడేపల్లిలోని వైయస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్‌ బాధితుల కష్టాలను, బాధలను తన 3,648 కిలో మీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో దగ్గరగా చూసిన జగన్‌ మోహన్‌ రెడ్డి గారు, అధికారంలోకి రాగానే వారికి డబ్బులు చెల్లించే కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు.

   పదివేలు లోపు డిపాజిట్‌ దారులైన 3 లక్షల 40వేల మందికి సుమారుగా రూ.240 కోట్లు ప్రభుత్వం ఇప్పటికే చెల్లించింది. మరలా ఈ నెల 24న రూ.20వేల లోపు డిపాజిట్లు కట్టిన బాధితులందరికి డబ్బులు చెల్లిస్తున్నాం. మొత్తం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, న్యాయస్థానాల​ పరిధులకు లోబడి కొంత అసౌకర్యం, ఇబ్బందులు ఎదురైనా మాట వాస్తవం. అయితే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది. 

   చంద్రబాబు నాయుడుగారు అధికారంలో ఉన్నప్పుడు కృషి బ్యాంక్‌, చార్మినార్‌ బ్యాంక్‌ కుంభకోణాలు చూశాం. వీటితోపాటు ఇంకా అనేక స్కామ్‌లు చూశాం. అయితే, చంద్రబాబు హయాంలో ఏరోజు కూడా ఆయా సంస్థల యాజమాన్యాలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయలేదు. కారణం ఏంటంటే.. ఆ సంస్థల యాజామాన్యాలకు,  చంద్రబాబు నాయుడుగారికి మధ్య జరిగిన లోపాయికారి ఒప్పందాల వల్లే, అప్పట్లో బాధితులందరూ నష్టపోయారు. ఇవాళేదో చాలామంది నీతులు మాట్లాడుతున్నారు. మేమేదో ఉద్యమించాం కాబట్టే జగన్‌ మోహన్‌ రెడ్డిగారు రూ.20వేలలోపు డిపాజిట్‌ దారులకు డబ్బులు ఇస్తున్నారని. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాన్ని ఈరోజు నెరవేరుస్తున్నారు. 

వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు అధికారంలోకి వచ్చాక ప్రతి ఏడాది సంక్షేమ క్యాలెండర్‌ను విడుదల చేసి, దానిప్రకారం పథకాలు అమలు చేస్తున్నాం. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని ఫిబ్రవరి 23వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాక, ఆ మరుసటి రోజు (24న తేదీన) మీడియాలో ప్రకటనలు కూడా వచ్చాయి. ఆగస్ట్‌లో అగ్రిగోల్డ్‌ బాధితులకు నష్టపరిహారం ఇవ్వబోతున్నామని అంశాన్ని చాలా క్లియర్‌కట్‌గా వార్త ద్వారానే కాకుండా,  ప్రకటన ద్వారా కూడా తెలియచేయడం జరిగింది.
వైయ‌స్‌ జగన్‌గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నైజంతో పాటు పేదవాడికి కష్టం వస్తే, వాటిని ఏవిధంగా అధిగమించాలా అనే విధంగా ఆలోచన చేస్తారు. ప్రభుత్వం అంటే ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం.  రూ.20వేలు డిపాజిట్లు కట్టినవారికి కోర్టు, న్యాయపరిధికి లోబడి వారికి ఈనెల 24న చెల్లింపులు చేస్తున్నాం. అగ్రిగోల్డ్‌ బాధితులు ఎవర్వూకూడా దయచేసి ఆందోళనకు గురికావద్దు. బాధితుల ఇళ్ల వద్దకే వాలంటీర్లు వచ్చి, ఈ నెల 19వ తేదీ వరకూ నమోదు కార్యక్రమం చేపట్టారు. మీరంతా ధైర్యంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటివరకూ 7లక్షల 76వేల దరఖాస్తులు వచ్చాయి. వెరిఫికేషన్‌ జరుగుతుంది. అది పూర్తయ్యాక అర్హులైన వారికి ఈ నెల 24న వారికి డబ్బులు జమ చేయడం జరుగుతుంది. 10వేల లోపు డిపాజిట్ దారుల్లో మిగిలిపోయినవారి అప్లికేషన్లు కూడా తీసుకోవడం జరిగింది. వారికి 264 కోట్లు కేటాయిస్తే.. రూ.247కోట్లు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది.

 అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం యోచన చేస్తోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అగ్రిగోల్డ్‌కు సంబంధించి కేసును తెలంగాణ హైకోర్టునుంచి ఏపీ హైకోర్టుకు బదిలీ చేయమని ఇప్పటికే ప్రభుత్వం పిటిషన్‌ వేసింది. అంతేకాకుండా ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు పెట్టించే యోచనలో ప్రభుత్వం ఉంది. అగ్రిగోల్డ్‌ బాధితులకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు తొలగించి, యాజమాన్యం మెడలు వంచి, సమస్యను పరిష్కారానికి కృషి చేసేలా ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 20వేల లోపు రుణాల గురించే కాకుండా, ప్రతి ఒక్క బాధితుడికి న్యాయం చేసేందుకు,  ఏవిధంగా న్యాయపరంగా ముందుకు వెళ్లాలనే దానిపై యోచన చేస్తోంది. ఈ నెల 24న మీ ఖాతాల్లో నగదు డిపాజిట్‌ చేసే క్రమంలో ఏమైనా సమస్యలు, ఇబ్బందులు వస్తే టోల్‌ఫ్రీ నెంబర్‌ ద్వారా మా దృష్టికి తీసుకురావాలి.  

  మోసానికి కేరాఫ్‌ చంద్రబాబు నాయుడు అయితే... నమ్మకానికి కేరాఫ్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు. జగన్‌గారు అంటేనే ఓ నమ్మకం, విశ్వాసం. ఆంధ్రప్రదేశ్‌ అంటే అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధి పథంలోనూ ముందుండాలనే విధంగా పరిపాలన చేస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు అగ్రిగోల్డ్‌ ఆస్తులను రహస్యంగా ఉంచడం జరిగింది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్‌ ఆస్తులను గుర్తించి స్వాధీనం చేసుకోవడం జరిగింది.

 పేదరికంతో ఏ ఒక్కరు ఉండకూడదనే ఉద్దేశంతో.. వారందరికీ ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు కట్టించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ గారు శ్రీకారం చుట్టి, లక్షల ఆస్తిని పేదలకు సమకూరుస్తున్నారు.  రాజకీయ పార్టీలకు ఒకటే చెబుతున్నాం.. మీతో చెప్పించుకుని చేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. కేవలం రాజకీయ లబ్ది కోసం ప్రభుత్వం మీద బురద చల్లాలని ప్రయత్నిస్తే ఆ బురద మీకే అంటుంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి, అంకిత భావం ఉందనే విషయాన్ని మీరంతా గమనించాల‌ని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు.
 

Back to Top