శ్రీవారి దర్శనం, పూజ టికెట్లు అమ్ముకునేంత దౌర్భాగ్యం నాకు పట్టలేదు

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ కెఆర్‌జె భరత్ 

చిత్తూరు:  తిరుమల శ్రీవారి దర్శనం, పూజ టికెట్లు అమ్ముకునేంత దౌర్భాగ్యం నాకు పట్టలేదని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ కెఆర్‌జె భరత్ స్ప‌ష్టం చేశారు. తాను ఒక బ్యూరోక్రట్‌ ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఉన్నత విలువలతో బ్రతికాను. నా తండ్రి ఒక ఐఏఎస్‌ అధికారి అని గుర్తు చేశారు. త‌న వద్ద మల్లికార్జునరావు అనే పీఆర్‌ఓ ఎవరూ లేరు. అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియద‌ని వెల్ల‌డించారు.  కేవలం కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేశానని, అక్కడ ఆయనను ఎదుర్కొంటూ రాజకీయాల్లో నిలబడుతున్నానన్న కక్షతో, నాపై కేసులు నమోదు చేస్తున్నారు. నన్ను అప్రతిష్టపాల్జేసేందుకు ఈ కుట్ర చేస్తున్నారు.
వాటిని నేను కచ్చితంగా ఎదుర్కొంటాను. అసలు నాపై ఫిర్యాదు చేసిన వారెవరు? పోలీసులు కేసులో రాసిన వాళ్లు ఎవరు?. అవన్నీ నేను ఆరా తీస్తాను. పూర్తి వివరాలతో మళ్లీ మీడియా ముందుకు వస్తానని భ‌ర‌త్ పేర్కొన్నారు.

Back to Top