వైయస్‌ జగన్‌ పాలనలోనే బీసీల అభివృద్ధి 

ఎన్నికల ముందే చంద్రబాబుకు బీసీలు గుర్తుకొస్తారు.

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి

గుంటూరు: బీసీలు రాజకీయంగా కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలకు 41 అసెంబ్లీ స్థానాలు,9 పార్లమెంటు స్థానాలు కేటాయించడం జరిగిందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు.వినుకొండ వైయస్‌ జగన్‌ ప్రచార సభలో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ఆర్‌ హయాంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అభివృద్ధి చేసి గుండెల్లో నిలిచిపోయారని, కుల,మతా,వర్గాలకు అతీతంగా సుపరిపాలన అందించారన్నారు.తెలుగుదేశం పాలనలో అరాచకాలు చూస్తున్నామన్నారు.  రైతుల రుణామాఫీ,డ్వాక్రారుణాలను మాఫీ చేస్తానని, ఇంటికోక ఉద్యోగం.. లేకపోతే  రెండు వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారన్నారు. దివంగత నేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆశయ సాధనకు  వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రి చేసుకోవాలన్నారు. 52 శాతం ఉన్న బీసీ వర్గాలకు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఎన్నికల ముందు మాత్రమే బీసీలు గుర్తుకువస్తారని, కరివేపాకులా వాడుకునే చంద్రబాబుకు బుద్ధిచెప్పాలన్నారు.బీసీలందరికి సమన్యాయం జరగాలని బీసీ డిక్లరేషన్‌ కూడా వైయస్‌ జగన్‌ ప్రకటించారన్నారు.

Back to Top