నామినేషన్‌ దాఖలు చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు

అమరావతి:  శాసన మండలిలో ఖాళీ స్థానాలకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఆరుగురు అభ్యర్థులు గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. చల్లా భగీరథరెడ్డి, బల్లి కల్యాణ్‌ చక్రవర్తి, దువ్వాడ శ్రీనివాస్, సీ.రామచంద్రయ్య, మహమ్మద్‌ ఇక్బాల్, కరీమున్నిసాలు ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని కలిసి బీ ఫామ్‌లు అందుకున్నారు. అనంతరం అసెంబ్లీలో నామినేషన్‌ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మండలి చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.
 

తాజా ఫోటోలు

Back to Top