పెన్మత్స సాంబశివరాజు కుటుంబానికి రాజ‌కీయ ప్రాధాన్య‌త‌

వైయస్ఆర్ ‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సురేష్ బాబును ఎంపిక చేసిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: దివంగ‌త సీనియ‌ర్‌ నాయకులు, విజయనగరం జిల్లాకు చెందిన పెన్మత్స సాంబశివరాజు కుటుంబానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాజ‌కీయ ప్రాధాన్య‌త క‌ల్పించారు. సాంబ‌శివ‌రాజు ఈ నెల 10వ తేదీ మృతి చెందారు. ఆ కుటుంబాన్ని రాజకీయంగా ఆద‌రించాల‌నే ఉద్దేశంతో ఆయ‌న‌ తనయుడైన డాక్ట‌ర్‌పెన్మత్స సూర్యనారాయణరాజు (డా.సురేష్‌బాబు)‌ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దింపాలని సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిర్ణయించారు. రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటుకు త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. దీంతో ఈ స్థానానికి సురేష్‌ బాబు పేరును ఖరారు చేశారు. కాగా ఏపీలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటాలోని ఒక ఎమ్మెల్సీ స్థానం భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైన విష‌యం తెలిసిందే. నామినేషన్ దాఖ‌లుకు ఆగ‌స్ట్ 13 చివరి తేదీ కాగా, 24న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు జ‌రిపి ఫలితాల‌ను వెల్ల‌డిస్తారు. 

తాజా ఫోటోలు

Back to Top