ముఖ్య‌మంత్రికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన ఇషాక్‌

తాడేప‌ల్లి: సీఎం క్యాంపు కార్యాల‌యంలో  ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డిని నంద్యాల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సి.ఇషాక్‌ బాషా మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్ధానానికి తన పేరును ఖరారు చేయడంతో ముఖ్యమంత్రిని కలిసి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఙతలు తెలిపారు. ముఖ్య‌మంత్రిని క‌లిసిన వారిలో డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజాద్‌ బాషా, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్, వైయ‌స్‌ఆర్‌సీపీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్‌ బాషా ఉన్నారు.

తాజా ఫోటోలు

Back to Top