నాడు రైతుల‌ను మోసం చేసి..ఇప్పుడు మొస‌లి క‌న్నీరా?

చంద్ర‌బాబును నిల‌దీసిన ఎమ్మెల్యే పార్థ‌సార‌ధి
 

అమ‌రావ‌తి:  చంద్ర‌బాబు త‌న త‌ప్పులు బ‌య‌ట‌ప‌డుతున్న‌ప్పుడ‌ల్లా డ్రామాలాడుతుంటార‌ని ఎమ్మెల్యే పార్థ‌సార‌ధి విమ‌ర్శించారు. 14 ఏళ్ల పాల‌న‌లో రైతుల‌ను మోసం చేసిన చంద్ర‌బాబు ఇప్పుడు మొస‌లి క‌న్నీరు కార్చుతున్నార‌ని మండిప‌డ్డారు. ప్ర‌తిప‌క్ష నేత‌, టీడీపీ నేత‌ల తీరు గ‌ర్హ‌నీయ‌మ‌ని ధ్వ‌జ‌మెత్తారు. 

 చంద్ర‌బాబు ఫ్ర‌స్ట్రేష‌న్‌లో ఉన్నారు: ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు
అమ‌రావ‌తి:  ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ఫ్ర‌స్ట్రేష‌న్‌లో ఉన్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు ఎద్దేవా చేశారు. ప్ర‌తిప‌క్ష నేత స‌భ‌లో సాంప్ర‌దాయాల‌కు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని త‌ప్పుప‌ట్టారు. రైతుల గురించి చ‌ర్చించే స‌త్తా లేక‌నే చంద్ర‌బాబు స‌భ‌ను ప‌క్క‌దోవ ప‌ట్టిస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు.

చంద్ర‌బాబు తీరు గ‌ర్హ‌నీయం:  ఎమ్మెల్యే జోగి ర‌మేష్‌
మైనారిటీ స‌భ్యుడి ప‌ట్ల చంద్ర‌బాబు తీరు గ‌ర్హ‌నీయ‌మ‌ని ఎమ్మెల్యే జోగి ర‌మేష్ మండిప‌డ్డారు. మైనారిటీ స‌భ్యుడిపై చంద్ర‌బాబు తుపాన్ పంట న‌ష్టంపై ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేసినా పోడియం వ‌ద్ద టీడీపీ డ్రామాలాడ‌టం స‌రికాద‌న్నారు. ఆ రోజు వ్య‌వ‌సాయం దండ‌గ అన్నారు..ఈ రోజు వ్య‌వ‌సాయంపై చ‌ర్చే వ‌ద్దంటున్నార‌ని ఫైర్ అయ్యారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top